తానా ఐఐపి మలి బృందం
డల్లాస్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2009 వ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. అమెరికాలో స్థిరపడిన తెలుగువారి నవతరానికి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు సంస్కృతి గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తానా కార్యదర్శి, తానా ఐఐపి చైర్మన్ ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 40 రోజుల పాటు హైదరాబాద్ కొనసాగే ఈ ఐఐపి కార్యక్రమ సమయంలో ఎంపికైన విద్యార్థులకు భారతదేశంలో నివాసం, పని విధానాలు ప్రత్యక్ష అనుభవంలోకి వస్తాయి. ఈ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఉన్నంత వరకూ ఇంటర్న్ షిప్ కు సంబంధించిన ఖర్చులన్నింటినీ తానా సంస్థే భరిస్తుందని ప్రసాద్ తోటకూర వెల్లడించారు. 2007వ సంవత్సరంలో భారతదేశానికి తొలిసారిగా పంపించిన విద్యార్థి బృందంలోని ఐదుగురు సభ్యులూ చక్కని అనుభవాల తిరిగి వచ్చారని ఆయన తెలిపారు.
తానా ఐఐపి రెండో బ్యాచ్ కు ఎంపికైన వారు వీరే :
1) దివ్య యలమంచిలి (డల్లాస్ - టెక్సాస్)- దువా అసోసియేట్స్ అంతర్జాతీయ లా సంస్థలో ఇంటర్న్ చేస్తున్నారు.
2) సాహిత్ ఆవుల (చాండ్లెర్ - ఆరిజోనా) - ఫాక్స్ మండల్ అంతర్జాతీయ లా సంస్థలో ఇంటర్న్ చేస్తున్నారు.
3) లేఖజ్ దగ్గుబాటి (మార్ల్ బోరో న్యూజెర్సీ) - కేర్ హాస్పిటల్ లో ఇంటర్న్ అయి ఉన్నారు.
4) కిర్ స్టెన్ సీత బొందలపాటి (డెట్రాయిట్, మిచిగన్) - కేర్ హాస్పిటల్ లో ఇంటర్న్ గా ఉన్నారు.
5) రేఖ కంభంపాటి (నార్త్ పోటోమాక్, మేరీలాండ్) - కేర్ హాస్పిటల్ లో ఇంటర్న్ అయి ఉన్నారు.
6) పూజ చేబ్రోలు (కొలంబస్, జార్జియా) - కేర్ హాస్పిటల్ లో ఇంటర్న్ గా ఉన్నారు.
ఇంటర్నేషనల్ ఇంటర్న్ కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థుల విద్యా సంబంధ నైపుణ్యం, ఎక్స్ ట్రా కరిక్యులర్ \ నాయకత్వ సంబంధమైన కార్యక్రమాల్లో వారి అనుభవం, ఉత్సాహం, తెలుగు భాష, సంస్కృతి పట్ల వారికి ఉన్న అభిరుచి, తెలుగు సంస్కృతి, వారసత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఐపి కార్యక్రమాన్ని వారు ఏ విధంగా వినియోగించుకుంటారన్న అంశాన్ని విశదీకరిస్తూ 750 పదాలతో రాసిన వ్యాసాన్ని తానా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఎంపిక చేసినట్లు తానా ఐఐపి కో చైర్మన్ ఎంవిఎల్ ప్రసాద్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 12 June, 2009
|