తానా ఐఐపి మలి బృందం
ఈ కార్యక్రమం జూన్ 22న ప్రారంభమై జూలై 31న పూర్తవుతుంది. ఈ కాలంలో ఈ ఆరుగురు అభ్యర్థులు హైదరాబాద్ లో ఉండి, తాము ఎంపికైన సంస్థల్లో అధ్యయనం చేస్తారు. జూన్ 19 ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కేర్ బంజారా హాస్పిటల్ లో నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య, ప్రవాసాంధ్రుల వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై తానా ఐఐపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణంరాజు, కేర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాశ్ గుళ్ళ, తానా ఐఐపి కో చైర్మన్ ఎంవిఎల్ ప్రసాద్, వేగేశ్న ఫౌండేషన్, ఫాక్స్ మండల్ లిటిల్ లా సంస్థ, దువా అసోసియేట్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. తానా ఐఐపి కార్యక్రమానికి వేగేశ్న ఫౌండేషన్ రెండో సారి కూడా స్థానిక కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తోంది.
ఈ కార్యక్రమానికి ఎంపికైన వారికి హైదరాబాద్ లోని సౌకర్యవంతమైన ప్రాంతంలో వసతి సౌకర్యం ఉంటుంది. వారంలో ఐదు రోజుల పాటు వీరంతా అక్కడి నుంచే తమకు కేటాయించిన సంస్థలకు వెళ్ళి అధ్యయనం కొనసాగిస్తారు. వారాంతాల్లో చారిత్రక ప్రాధాన్యం గల చార్మినార్, గోల్కొండ కోట, షాపింగ్ సెంటర్లు, రామోజీ ఫిల్మ్ స్టుడియో లాంటి వినోదాత్మక కేంద్రాలను, అసెంబ్లీహాల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లాంటి విద్యా సంస్థలను సందర్శిస్తారు. ఈ ఇంటర్న్ షిప్ లో భాగంగా వీరు కుగ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లోని జీవన విధానాలను కూడా అధ్యనం చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు తెలుగు సంస్కృతి, వారసత్వంపై పూర్తి స్థాయి అనుభవం లభిస్తుందని ప్రసాద్ తోటకూర తెలిపారు.
తానా ఐఐపి 2009 కమిటీ చైర్మన్ గా ప్రసాద్ తోటకూర, కో చైర్మన్ గా ఎంవిఎల్ ప్రసాద్ వ్యవహరిస్తుండగా, సభ్యులుగా ప్రభాకర్ చౌదరి కాకరాల, జయరామ్ కోమటి, మోహన్ నన్నపనేని, దీపిక సగరం ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 12 June, 2009
|