షికాగోలో తెలుగు పండుగ
షికాగో తెలుగు పండుగలో భాగంగా కనీ వినీ ఎరుగని రీతిలో వినోద కార్యక్రమాలు, షడ్రసోపేతమైన తెలుగు వంటకాలతో విందు భోజనాన్ని అతిథులకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రవి ఆచంట పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు సినీ నేపథ్య సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నేతృత్వంలో సంగీత విభావరి, ప్రసిద్ధ తెలుగు గజల్ గంధర్వుడు గజల్ శ్రీనివాస్ గజళ్ళు, వందేమాతరం శ్రీనివాస్, టాలీవుడ్ హాస్య నటులు అలీ, హేమ ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తేందుకు సిద్ధమై వస్తున్నారు. 'కిక్' సినిమా బృందానికి సంబంధించి హీరో రవితేజ, హీరోయిన్ ఇలియానా, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి జూలై 3న జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. టాలీవుడ్ నటీమణులు మమతా మోహన్ దాస్, సంజన, పార్వతీ మెల్టన్, నిఖిత స్టార్ నైట్ కార్యక్రమంలో ప్రదర్శనలిస్తారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు రవి భవిరి, టాలీవుడ్ సింగర్స్ సింహ, మాళవిక, హిమబిందు, ఈలపాట రమణారెడ్డి తమ తమ కార్యక్రమాలతో ఆహూతులను అలరించేందుకు వస్తున్నారని రవి ఆచంట వెల్లడించారు.
షికాగో తెలుగు పండుగ వేదిక వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రవి ఆచంట తెలిపారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు పలు పెద్ద పెద్ద సంస్థలు హాజరవుతున్నాయని తెలిపారు. ఈ పండుగకు హాజరైన ప్రతి ఒక్కరికీ షడ్రసోపేతమైన ఆంధ్రా విందు భోజనం అందిస్తామని రవి ఆచంట పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 25 June, 2009
|