తెలుగు సంబరాలు సక్సెస్
జూలై 3న ఫ్లోరిడా గవర్నర్ చార్లీ క్రిస్ట్ అమెరికా తెలుగు సంబరాలలో పాల్గొన్నారని శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టీ మాట్లాడుతూ, స్థానిక తెలుగు ప్రజలు ఇంత పెద్ద ఈవెంట్ ను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమెరికాలో నానాటికీ పెరుగుతున్న భారతీయ సంతతిని చూస్తుంటే ముచ్చటగా ఉందని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశం పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన చెప్పారు. ప్రజల కోసం, ప్రజల చేత అంటూ ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పిన అహ్రబాం లింకన్ మాటలు భారతదేశం విషయంలో అక్షర సత్యమని అన్నారు. అమెరికన్ సమాజంలోని ప్రతి భాగంలో ప్రవాస భారతీయులు ఒక అంతర్భాగంగా అవతరించడం ముదావహం అని క్రిస్టీ పేర్కొన్నారు. ఫ్లోరిడాలో నాట్స్ వంటి సేవా తత్పరత కలిగిన సంస్థ ఆవిర్భవించడం తనకు గర్వకారణమని ఆయన ప్రకటించారు.
అనంతరం ప్రవాస తెలుగు కుటుంబాలకు చెందిన బాలికల నృత్య ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. దీని తదనంతరం రెండు రోజులపాటు వరుసగా నిర్వహించిన, సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సంబరాలు జరుగుతున్న వేదిక వద్ద ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. యువతీయువకుల ఫ్యాషన్ షో, మణి, నాగరాజుల వేణు వాదం, అన్నమయ్య లక్ష గళ సంకీర్తన సభికులను మంత్రముగ్దులను చేశాయి. రాజీవ్ ఎస్ ఖన్నా ఇమ్మిగ్రేషన్ పై నిర్వహించిన ఫోరమ్ లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని ప్రస్తుత పరిణామాలపై అనేక సందేహాలకు సమాధానాలు పొందారు.
సంబరాలలో తెలగు చిత్ర సీమకు చెందిన నటులు తారకరత్న, శ్రీకాంత్ లకు ఘన సన్మానం జరిగింది. అనంతరం సంబరాలలో పాల్గొన్న తెలుగు సినీ నటులు ఇచ్చిన ప్రదర్శనలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ వినోద కార్యక్రమాలలో తెలుగు చిత్ర సీమకు చెందిన తనికెళ్ళ భరణి, సాయి కుమార్, జయలలిత, అలీ తదితరులు పాల్గొన్నారు. శివమణి వాద్యభేరి ఈ కార్యక్రమాలకే హైలైట్.
Pages: -1- 2 News Posted: 5 July, 2009
|