'అభిరుచి'లో వైఎస్ బర్త్ డే
న్యూజెర్సీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం త్వరలోనే సమసిపోగలదన్న దృఢ విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయం, కోర్టులు, సాంకేతిక విద్యా శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 108, ఆరోగ్యశ్రీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఎన్నారైల విద్యా సౌకర్యాల గురించి మంత్రి పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం గురించి కూడా మోపిదేవి ప్రస్తావిస్తూ ఒక్కో ప్రవాసాంధ్రుడు ఆంధ్రప్రదేశ్ లోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చేయూతనివ్వాలని మంత్రి మోపిదేవి పిలుపునిచ్చారు. ఇక్కడి నార్త్ బ్రన్స్ విక్ లోని 2800 ర్యాన్ ప్లాజాలోని 'అభిరుచి' రెస్టారెంట్ లో జూలై 12 వ తేదీ ఆదివారం నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 60 జన్మదిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రవాసాంధ్రులందరూ మంత్రిని సాదరంగా ఆహ్వానించారు.
అభిరుచి రెస్టారెంట్ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవాలకు 150 మందికి పైగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని అభిరుచి యజమానులు రామశేషయ్య బుడ్డి, శ్రీనాథ్ ధూళిపాళ్ళ ప్రారంభించారు. సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది. వైఎస్సార్ జన్మదినం సందర్భంగా మంత్రి వెంకటరమణ ముందుగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
Pages: 1 -2- News Posted: 13 July, 2009
|