'అభిరుచి'లో వైఎస్ బర్త్ డే
అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన వైఎస్సార్ జన్మదినోత్సంలో న్యూజెర్సీలో ఉంటున్న ప్రవాసాంధ్రులు దొడ్డపనేని హరినాథ్, విజయ్ బండ్ల, నరేంద్రరెడ్డి, రమమ గన్నె, ప్రసాద్ కనగల, పూర్ణ ప్రసాద్ సూరపనేని, రవి వీరవల్లీ, మురళి, రాజా, రవి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి పలువురు ప్రవాసాంధ్రులు ప్రశంసించారు. మంత్రి మోపిదేవి సమక్షంలో పలువురు ప్రవాసాంధ్రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ అభిరుచి యాజమాన్య అత్యంత రుచికరమైన ఆంధ్రా భోజనం సరఫరా చేసింది. తెలుగు ప్రజలకు చక్కని సేవలందిస్తున్న అభిరుచి యాజమాన్యాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ అభినందించారు.
Pages: -1- 2 News Posted: 13 July, 2009
|