'ఇండియానా'లో వైఎస్ విక్టరీ
పారిశ్రామిక రంగం అభివృద్ధికి వైఎస్ చేస్తున్న విశేష కృషి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి విశాఖపట్నంలోని సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్కూల్ నుంచి విజిటింగ్ ప్రొఫెసర్ గా హాజరైన కృష్ణమూర్తి సవిరంగా తెలియజేశారు. కర్నూలు నుంచి అమెరికా పర్యటనకు వచ్చిన చంద్రశేఖరరెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహ పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాల రియంబర్స్ మెంట్ 108, 104 సంచార వైద్య వాహనాలు, ఉచిత విద్యుత్ లాంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలు కూడా ఎలా లబ్ధి పొందుతున్నారో ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. బాలిరెడ్డి, విన్నీరావు, వినోద్ సాధు, యుగంధర్ గంగిరెడ్డి, దామోదర్ వెంకురెడ్డి, సుధీర్ తొండపు ఈ కార్యక్రమంలో సమయస్ఫూర్తితో చేసిన ప్రసంగాలు ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు హాజరైన ఈ కార్యక్రమంలో రాజశేఖరరెడ్డి 60 పుట్టిన రోజును పురస్కరించుకొని బర్త్ డే కేక్ కట్ చేశారు. మరో ఐదేళ్ళపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పథంలో నడిపించాలని శుభాకాంక్షలు చెప్పారు.
అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ నోరూరించే, కమ్మని షడ్రసోపేతమైన విందును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వైఎస్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ కృష్ణారావు దాసరి కృతజ్ఞతలు తెలిపారు. ఐనాక్ కు మరింతగా మద్దతు తెలిపి ప్రోత్సాహించాలని అతిథులకు విజ్ఞప్తి చేశారు.
Pages: -1- 2 News Posted: 15 July, 2009
|