మార్మోగిన 'జనం పాట'
స్థానిక చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో సాయంత్రం పూట 'జానపదం... జనం పాట' కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సభ్యులు, నల్గొండ ఓఆర్జీ సభ్యులు, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ, పద్యం కన్నా ముందే పాట పుట్టిందన్నారు. సాధారణ పాట కన్నా ముందే జానపద గేయం ప్రజల నాలుకల మీద నాట్యం చేసిందన్నారు. పొలంపనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు, కాలక్షేపం కోసం పొలాల్లో పనిచేసే రైతులు తమకు తోచిన విధంగా మాటలను కూర్చుకొని జానపద గేయాన్ని ప్రారంభించారన్నారు. తనదైన శైలిలో జానపదాలను పాడుతూ సుద్దాల అశోక్ తేజ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జానపద గేయాలతో సంబంధం లేనప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరైన జొన్నవిత్తుల తాను రచించిన 'శ్రీ రామలింగేశ్వర శతకం' నుంచి కొన్ని పద్యాలను శ్రవణానందంగా వినిపించారు. 'మాయమైపోతున్నదమ్మో... మనిషి' అంటూ అందెశ్రీ ఆలపించిన జానపద గేయం అందరి ప్రశంసలూ అందుకుంది. తనదైన 'ఫైర్ బ్రాండ్' శైలిలో గోరెటి వెంకన్న పాడిన గేయాలు రాయల్ ఆల్బెర్ట్ ప్యాలస్ సభ భవనాన్ని దద్దరిల్లేలా చేశాయి.
దాము గేదల తదితరులు అతిథులుగా హాజరైన కవులను సత్కరించారు. సుబ్బారావు చెన్నూరిని కూడా ఈ సందర్భంగా సన్మానించారు. సమావేశానంతరం 'జానపదం... జనం పాట' కార్యక్రమం నిర్వహణకు అయిన ఖర్చు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని పుట్టిన రోహిత గేదల అనే ఎనిమిదేళ్ళ చిన్నారి తన కిడ్డీ బ్యాంకులో పొదుపు చేసుకున్న 25 డాలర్లను నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలకు విరాళంగా అందజేసింది. అనంతరం ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన 10వేల డాలర్లను అంధుల పాఠశాలకు విరాళంగా అందజేస్తున్నట్లు మహేందర్ ముసుకు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి దాము గేదలకు చెందిన 'కోరియాండర్ కుషన్' రెస్టారెంట్ అతి తక్కువ ధరకే ఆహారపదార్థాలు సరఫరా చేసిందని తెలిపారు.
ఒక మంచి కార్యక్రమానికి విరాళాలు అందించిన వారికి, కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు సమావేశ మందిరాన్ని ఉచితంగా ఏర్పాటు చేసిన రాయల్ ఆల్బెర్ట్ ప్యాలస్ యజమాని ఆల్బెర్ట్ జసానికి వాసు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంజు భార్గవ చక్కని సమన్వయంతో నిర్వహించారు. జానపదం ... జనం పాట కార్యక్రమానికి హాజరైన వారిలో వాసు విశ్వనాథుల, అమర్ రెడ్డి, శ్రీనివాస్ గనగోని, మహేందర్ ముసుకు, మురళి చింతలపాని, రవి ధన్నపునేని, రమేష్ చంద్ర, సురేష్ రెడ్డి, రవి తోట, హరి ఎప్పనపల్లి, సరోజ సగరం, ముత్యాల వెంకటేశ్, రవి కొండబోలు, మోహన్ నన్నపునేని, వినోద్ కోడూరు, నరేంద్ర, ప్రదీప్, రెడ్డి, ఉపద్రష్ట సత్యనారాయణ, ఆనంద్ పాలూరి, రామకృష్ణ శీతల, గిరిజ కొల్లూరి, మంజు భార్గవ, సత్య నేమన, రోహిణీకుమార్ వేముల, ఇందిర యలమంచి, లక్ష్మి మల్లెల, శ్రీనివాస్ గొనగాని తదితరులు ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 22 July, 2009
|