నాట్స్ హెల్ప్ లైన్ ప్రారంభం
ఉత్తర అమెరికాలోని తెలుగువారికి జీవితాలను మెరుగు పరిచే క్రమంలో హెల్ప్ లైన్ అవసరం ఉన్నవారికి, సహాయం చేసేందుకు సహృదయంతో ముందుకు వచ్చే వారికి చక్కని సమన్వయం కలిగించేందుకు నాట్స్ సంస్థ వారధిగా కృషిచేస్తుందని ఆ సంస్థ కార్యదర్శి శ్రీనివాస్ కోనేరు స్పష్టం చేశారు.
నాట్స్ హెల్ప్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూజెర్సీ కాంగ్రెస్ మన్ ఉపేంద్ర చివుకుల, నాట్స్ చైర్మన్ డాక్టర్ రణకుమార్ నాదెళ్ళ, ప్రెసిడెంట్ రవీంద్ర మాదల, తానా వ్యవస్థాపక సభ్యుడు హరీష్ కోయ, ఆటా ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని, టిఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ దాము గేదల, టిఎల్ సిఎ ప్రెసిడెంట్ వెంకటర్ ముత్యాల, కార్యదర్శి శివ ముతికి, టిఎజిడివి ప్రెసిడెంట్ సరోజ సగరం, యుడిఎఎ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, సంయుక్త కార్యదర్శి లలితా శెట్టి, స్థానికంగా ప్రసిద్ధుడైన వ్యాపారి డాక్టర్ దేసు గంగాధర్, ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యదర్శి మహేష్ సలాది తదితర ప్రముఖులు హాజరయ్యారు.
తెలుగువారికి సహాయ సహకారాలు అందించే మంచి లక్ష్యంతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్న నాట్స్ సంస్థ నిర్వాహకులను కాంగ్రెస్ మెన్ ఉపేంద్ర చివుకుల అభినందించారు. నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా వైద్య సహాయం పొందగోరిన వారికి మందులను ఉచితంగా అందిస్తామని డాక్టర్ దేసు గంగాధర్, విజయ్ అన్నప్పరెడ్డి ప్రకటించారు.
నాట్స్ హెల్ప్ లైన్ సక్రమ నిర్వహణ కోసం సూచనలు సలహాలు, ఇతర విలువైన సేవలు, హెల్ప్ లైన్ వలంటీర్లుగా సేవలు అందించాలనుకునేవారు info@natsworld.org లో సంప్రతించవచ్చు.
Pages: -1- 2 News Posted: 27 July, 2009
|