తానా ఐఐపి విజయవంతం
టెక్సాస్ : రెండేళ్ళకోసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహిస్తున్న ద్వితీయ 'ఇంటర్నేషనల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ఫర్ యూత్ - 2009' కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్, తానా ఐఐపి కార్యక్రమం చైర్ పర్సన్ ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 2వ తేదీన హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు తానా ఐఐపి 2009 స్కాలర్లకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ఈ ఆరుగురు విద్యార్థులకు 'తానా ఐఐపి బ్రాండ్ అంబాసిడర్లు'గా ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి, ఎన్నారై వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళి శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 22న ప్రారంభమైన తానా ఐఐపి కార్యక్రమం జూలై 31తో పూర్తయింది.
తానా ఐఐపి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారీ పుష్పగుచ్ఛాన్ని అందించారు. విద్యార్థులను ముఖ్యమంత్రికి తానా ఐఐపి కో చైర్ పర్సన్ ఎం.వి.ఎల్. ప్రసాద్ పరిచయం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంమైన జూన్ 18వ తేదీ నుంచీ 41 రోజుల కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో పాటే ఉన్నారు. స్థానిక కో ఆర్డినేటర్లు ఫాక్స్ మండల్ - లిటిల్ (ఇంటర్నేషనల్ లా ఫర్మ్) కు చెందిన పూర్ణిమా కాంబ్లె, ఆర్. సుభాషిణి, తానా ఐఐపి కార్యక్రమం ప్రారంభం నుంచి భారతదేశంలో కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న వేగేశ్న ఫౌండేషన్ కు చెందిన రామరాజు, శ్రీమతి సుధ తెన్నేటి, పి. బాల, ఎస్. శైలజ, మెడికల్ ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కేర్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ జి. సూర్యప్రకాశ్, డాక్టర్ బి.ఎస్. మూర్తిలను కూడా ముఖ్యమంత్రికి ఎంవిఎల్ ప్రసాద్ పరిచయం చేశారు.
Pages: 1 -2- News Posted: 3 August, 2009
|