తానా ఐఐపి విజయవంతం
తానా ఐఐపి కార్యక్రమాన్ని తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్, తానా ఐఐపి చైర్ పర్సన్ ప్రసాద్ తోటకూరతో కలిసి మూడేళ్ళ క్రితం రూపొందించినట్లు తన ఆహ్వాన ప్రసంగంలో ఎంవిఎల్ ప్రసాద్ తెలిపారు. అమెరికాలో ఉంటున్న తెలుగు యువతీ యువకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుగు సంస్కృతి పట్ల అవగాహన కల్పించాలన్నది ఈ కార్యక్రమం రూపకల్పన వెనుక గల ప్రధాన లక్ష్యం అన్నారు. తానా రెండో ఐఐపి కార్యక్రమాన్ని జూన్ 18న ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తానా ఐఐపి గ్రాడ్యుయేట్లకు ముఖ్యమంత్రి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. స్థానిక కో ఆర్డినేటర్లను జ్ఞాపికలు అందజేశారు. ఎంవిఎల్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
తానా ఐఐపి 2009 కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు వీరే :
దివ్య యలమంచిలి, సాహిత్ ఆవుల, లేఖజ్ దగ్గుబాటి, కిర్ స్టెన్ సీత బొందలపాటి, రేఖ కంభంపాటి, పూజ చేబ్రోలు. తానా ఐఐపి 2009 కమిటీ సభ్యులుగా జయరామ్ కోమటి, మోహన్ నన్నపనేని, దీపిక సగరం వ్యవహరించారు.
Pages: -1- 2 News Posted: 3 August, 2009
|