మేడసాని సమ్మోహనం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/av1.gif' align='left' alt=''>
సిలికాన్ వేలీ : మూడు రోజుల పాటు జరగాల్సిన శతావధానం సాహితీ ప్రక్రయను కేవలం ఐదు గంటల్లో విజయవంతంగా పూర్తవడం చారిత్రాత్మకం అని అవధాన సామ్రాట్, మహా సహస్రావధాని మేడసాని మోహన్ పేర్కొన్నారు. అవధానం కూడా క్రికెట్ లో 20 -ట్వంటీ మ్యాచ్ మాదిరిగా మారిపోయిందని ఆయన చమత్కరించారు. సిలికాన్ వేలీలోని మిల్పిటస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో ఆగస్టు 9 ఆదివారంనాడు మేడసాని మోహన్ శతావధానం కార్యక్రమం జరిగింది. సాహితీ ప్రియుడు రఘు మల్లాది ఆధ్వర్యంలో బే ఏరియా తెలుగు సంఘం, దోసా ప్లేస సంస్థ సంయుక్తంగా ఈ శతావధానాన్ని నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు శరవేగంతో పద్యాలు కట్టి తన భాషా పటిమను, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన మేడసాని ఆహూతులందరినీ సమ్మోహితుల్ని చేశారు.
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/av2.gif' align='center' alt=''>
ఈ సందర్భంగా మేడసాని మాట్లాడుతూ, ఎన్నెన్నో అవధానాలు చేసిన ఇలాంటి అపురూపమైన, చారిత్రక శతావధానం చేయడం తనకు ఇదే తొలి అన్నారు. అమెరికాలో తాను ఇలాంటి అవధానం నిర్వహించడమూ ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. శతావధానం అంటే నూరు పద్యాలు కట్టాలి. అష్టావధానంలోని అంశాలన్నింటినీ ఈ శతావధానంలో చేర్చడం మరో సరికొత్త ప్రయోగం అన్నారు. ఎన్నో నూతన ఒరవడులతో కొనసాగిన ఈ శతావధానం 'న భూతో న భవిష్యతి' అనే విధంగా నిర్వహించగలగడం తన అదృష్టం అన్నారు. క్రికెట్ క్రీడలో కాలానికి అనుగుణంగా మార్పులు వచ్చినట్లే సాహితీ ప్రియుల అభిరుచి మేరకు అవధానంలో కూడా మార్పులు వస్తాయని చెప్పారు. ఈ శతావధానమే దానికి ప్రత్యేక ఉదాహరణ అన్నారు. క్రికెట్ క్రీడపై పృచ్ఛకులు అడిగిన ప్రశ్నకు పద్యాలు కట్టి 'ఈ శతావధానం అవధాన క్రికెట్లో ట్వంటీ ట్వంటీ క్రికెట్ లాంటి'దని చమత్కరించారు. మూడు రోజుల పాటు అవధానాలను వీక్షించే ఓపిక, తీరిక లేని వేగవంతమైన జీవితాలు గడుపుతున్న ప్రస్తుత కాలంలో ఐదు గంటలకే కుదించి ఇలా రూపకల్పన చేయడం చారిత్రాత్మకం అన్నారు.
అష్టావధానంలో ఉండే నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, సమస్య, ఆశువు, వర్ణన, దత్తపది, పురాణ పఠనం, అప్రస్తుతం లాంటి అన్ని అంశాలను ఈ శతావధానంలో చేర్చి నరు మంది పృచ్ఛకులకు బదులుగా పాతిక మంది నాలుగు పర్యాయాలు చకచక ప్రశ్నలు సంధిస్తే, అంతకన్నా వేగంగా అందమైన, అర్థవంతమైన పద్యాలు కూర్చి మేడసాని మోహన్ అందరినీ ఆశ్యపరిచారు. మహమ్మదు, మోజసు, బైబిలు, ఖురాను వంటి పదాలిచ్చి దుర్యోధన స్తుతి చేయమన దత్తపది ఇస్తే అలవోకగా క్షణంలో పద్యం కట్టి మెప్పించారు మేడసాని. నిషిద్ధాక్షరిని, న్యాస్తాక్షరినీ నల్లేరు మీద నడకలా పూర్తి చేశారు.
Pages: 1 -2- News Posted: 12 August, 2009
|