మేడసాని సమ్మోహనం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/av3.gif' align='left' alt=''>
ప్రస్తుతం సమాజంలో ఎదురవుతున్న పలు సమస్యలపై సంధించిన సమస్యా, ఆశువూ, వర్ణనలు వంటి అంశాలను మరింత రమ్యంగా మేడసాని పూరించారు. అర్థవంతమైన ప్రశ్నలు, సమస్యలూ అడిగి ఎంతో పాండితీ ప్రతిభ చూపించారంటూ పాతిక మంది పృచ్ఛకులను మేడసాని మోహన్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఇంతమంది పద్యాలు కట్టేవారుంటే అమెరికాలో ఇక తెలుగు భాషకు ఢోకా లేదన్నారు.
ఈ శతావధానంలో విజయ ఆసురి స్వాగతోపన్యాసం చేస్తూ అతిథులను ఆహ్వానించారు. కిరణ్ ప్రభ అవధానిని పరిచయం చేశారు. రెండు విడతలుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని బి.కె. రావు, చిట్రాజు గోవిందరాజు అధ్యక్షత వహించి సమయస్ఫూర్తితో నిర్వహించారు. ఈ శతావధానానికి హరి శాస్త్రి వ్యాకరణ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆరు వందల మందికి పైగా సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై ఆసాంతమూ ఆనందంగా తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుడు రఘు మల్లాదిని అందరూ అభినందించారు. కార్యక్రమం ఆఖరున శతావధాని మేడసాని మోహన్ ను బే ఏరియా తెలుగు సంఘం (బాటా) అధ్యక్షుడు ప్రసాద్ మంగిన సత్కరించారు.
పృచ్ఛకులుగా బాల ఉపద్రష్ట, శివచరణ్ గుండ, రామ్ గొల్లపూడి, తాటిపాముల మృత్యుంజయుడు, పార్వతి ప్రఖ్య, అనిల్ దాసరి, రత్నాకర్, కృష్ణ అక్కులు, మూర్తి రాయప్రోలు, గరికపాటి శివరామకృష్ణ శర్మ, ప్రఖ్య మధుబాబు, ప్రఖ్య వంశీ, రఘు మల్లాది, కృష్ణకుమార్ పిల్లలమర్రి, కె. శ్రీనివాసరావు, మహమ్మద్ ఇక్బాల్, సావిత్రి మాచిరాజు, నల్లమోతు ప్రసాద్, పుల్లెల శ్యాంసుందర్, రమణారావు లక్కరాజు, రావు తల్లాప్రగడ, మాధవి కడియాల, ఈరంకి కామేష్, వేమూరి వెంకటేశ్వర రావు, చింతపల్లి శర్మ, సురేంద్ర దారా, బహ్మానందం గొర్తి వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృచ్ఛకులను బాటా ఉపాధ్యక్షురాలు శ్రీలు వెలిగేటి, కార్యదర్శి శ్రీనివాస్ కొల్లి, ఉపకార్యదర్శి రమేష్ కొండా, శ్రీని మంగిపూడి, కామేష్ మల్లా, కరుణ్ వెలిగేటి, యుగంధర్ కాకరాల, రవి తిరవీధుల, శిరీష బత్తుల, శివ అడబాల, వెంకట్ మల్లాది మొమెంటోలు అందజేశారు. శతావధానానికి వీరు ఉప్పల సాంకేతిక సహకారం అందించారు. ఇంత చక్కగా శతావధానం కార్యక్రమం జరిగేందుకు కృషి చేసిన కార్యకర్తలను, ముఖ్యంగా తాటిపాముల మృత్యుంజయుడిని ఆహూతులు అభినందించారు. సాయి బ్రహ్మానందం గొర్తి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
Pages: -1- 2 News Posted: 12 August, 2009
|