అలరించిన 'పాటలపందిరి'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/5a.gif' align='right' alt=''>
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర 8వ వార్షికోత్సవ సంబరాలు ఆగస్టు 8న సన్నీవేల్ హిందూ దేవాలయంలో ఘనంగా జరిగాయి. అమెరికాలో ప్రప్రథమంగా ఒక లలిత సంగీత శిక్షణా శిబిరం నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత సిలికానాంద్ర సంస్థకే దక్కింది. ఈ సంగీత శిబిరంలో శిక్షణ పొందిన వారితో 'పాటల పందిరి' కార్యక్రమాన్ని సిలికానాంధ్ర వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సంగీత దర్శకుడుగా, గురువుగా సుప్రసిద్ధుడైన రామాచారిని సిలికానాంధ్ర సంస్థ ఆహ్వానించి, ఆయన ఆధ్వర్యంలో మూడు వారాల పాటు ఈ సంగీత శిక్షణా శిబిరం నిర్వహించడం విశేషం. రాళ్ళ చేత కూడా చక్కని తాళంతో రామాచారి పాటలు పాడించగలడనంలో ఆశ్చర్యంలేదు.
తెలుగు మాట తెలిసినా భావం తెలియని పిల్లలకు, భాష తెలిసినా శృతి, లయ తెలియని పెద్దలకు, వృద్ధులకు అందరికీ పాటలోని సంగతులన్నీ చక్కగా వివరించి, వయో తారతమ్యం లేకుండా అందరూ ఆహ్లాదంగా, ఆనందంగా వేదిక మీద పాడే స్థాయికి రామాచారి తీర్చిదిద్దారు. ఈ సంగీత శిక్షణాశిబిరంలో చక్కని తేనెలూరు తెలుగులో జాలువారిన లలిత గీతాలకే పెద్దపీట వేశారు. ఈ గీతాలలో గుండెల నిండా ఆర్ద్రత నింపే కరుణరస గీతాలు, కోమాలో ఉన్న వారిని సైతం నృత్యం చేయించగల జానపదాలు, దేశభక్తి గీతాలు ఉన్నాయి.
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/13c.gif' align='left' alt=''>
అమెరికాలోని తెలుగు పిల్లందరికీ తెలుగు నేర్పించాలని, సిలికానాంధ్ర 'మన బడి' ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ 'మన బడి' కాలిఫోర్నియాలో ఓ చిరు పాయగా మొదలై, ప్రస్తుతం ఒక మహా సముద్రమై అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించడం విశేషం.
Pages: 1 -2- News Posted: 13 August, 2009
|