సిలికానాంధ్ర వార్షికోత్సవం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/15b.gif' align='right' alt=''>
సిలికానాంధ్ర సంస్థ 8వ వార్షికోత్సవాల సందర్భంగానే మన బడి స్నాతకోత్సవం కూడా జరిగింది. మొదట సిలికానాంధ్ర ప్రెసిడెంట్ చామర్తి రాజు మన బడి ధ్యేయం గురించి, సాధించిన విజయాల గురించి ప్రసంగించారు. తరువాత స్నాతకోత్సవం సందర్భంగా భారతదేశం నుండి వచ్చిన ప్రముఖుల ద్వారా 'ప్రవేశం, ప్రకాశం' తరగతులలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు.
తదుపరి కార్యక్రమం మారేపల్లి వేంకటశాస్త్రి వేద పఠనంతో ప్రారంభమైంది. గత 8 సంవత్సరాలుగా సిలికానాంధ్ర సంస్థ సాధించిన ఘనతను పల్లా రత్నాకర్ చక్కని కవితా రూపంలో వర్ణిస్తూ వినిపించారు. రామాచారి గురించి, 'పాటల పందిరి' కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మాడభూషి విజయసారథి అందించారు.
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/7d.gif' align='left' alt=''>
అనంతరం రామాచారి ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు సంగీత కార్యక్రమం 'పాటల పందిరి' రసవత్తరంగా కొనసాగింది. ఈ సంగీత కార్యక్రమంలో రామాచారి, ఆయన దగ్గర మూడు వారాలపాటు పాటలు నేర్చుకొన్న శిష్య బృందం పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఆయా పాటలకు ప్రేక్షకులు మైమరచి నృత్యం చేయడం విశేషం. చివరిగా దేవేంద్ర నరాల వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Pages: -1- 2 News Posted: 13 August, 2009
|