'అత్తగారి కథలు'పై విశ్లేషణ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/IMG_0266b.gif' align='right' alt=''>
విశిష్ట అతిథిగా హాజరైన నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయ బయాలజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ పూదూర్ జగదీశ్వరన్ ను వంగూరి చిట్టెన్ రాజు సభకు పరిచయం చేశారు. జగదీశ్వరన్ అష్టావధాని, రచయిత, కవిగా పేరు పొందిన వారని చిట్టెన్ రాజు తెలియజేశారు. జగదీశ్వరన్ 'అష్టావధానం - అవధాన ప్రక్రియ' అనే అంశాన్ని ఆయన విపులంగా వివరించారు. భారతదేశంలోనే కాకుండా అమెరికాలో ఇరవై అవధానాలు చేసిన అనుభవాలను సభతో పంచుకున్నారు.
సభ ప్రారంభంలో గత ఇరవై సంవత్సరాల సాంప్రదాయాన్ని పాటిస్తూ తెలుగు సాంస్కృతిక సమితి, ఆటా, తానా సంస్థలు తరఫున ధర్మకర్త ముత్యాల భాస్కరరావు ముగ్గురు హైస్కూలు విద్యార్ధులకు ఐదు వందల డాలర్ల స్కాలర్ షిప్ లు అందజేశారు. ఆటా సంస్థ అధ్యక్షుడు జితేందర్ రెడ్డితో పాటు TCA మాజీ అధ్యక్షుడు రామ్ చెరువు, TCA నిర్వాహక సంఘ సభికులు శ్రవణ్ అర్రతో పాటు సుమారు అరవై మంది సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి, సభను విజయవంతం చేశారు. సభానంతరం అల్పాహారవిందును నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
Pages: -1- 2 News Posted: 26 August, 2009
|