తానా బ్యాక్ ప్యాక్స్ పంపిణీ

డల్లాస్ నగరంలోని హోప్ మెడ్రానో పాఠశాలలో నిర్వహించిన బ్యాక్ ప్యాక్ ల పంపిణీ కార్యక్రమంలో మూడు పాఠశాలల విద్యార్థులకు తానా, టాన్ టెక్స్ సంస్థలు అందజేసినట్లు ప్రసాద్ తోటకూర వెల్లడించారు. ఈ కార్యక్రమానికి డల్లాస్ నగర మేయర్ టామ్ లెప్పెర్ట్, నగర కౌన్సిల్ మహిళా కౌన్సిలర్ పాలిన్ మెడ్రానో, డల్లాస్ జిల్లా పాఠశాలల సూపరింటెండెంట్ డాక్టర్ మైఖేల్ హినోజోస ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని తానా తరఫున ప్రసాద్ తోటకూర, రామ్ యలమంచిలి, మురళి వెన్నం, రాజేశ్ వీరపనేని, సి.ఆర్. రావు, రామ్ కి చేబ్రోలు, రావు కల్వల, మంజులత కన్నెగంటి, టాన్ టెక్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) చంద్ర కన్నెగంటి సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన అధికారులకు, ప్రధాన దాత డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి, ఇతర దాతలకు తానా అధ్యక్షుడు జయరామ్ కోమటి, టాన్ టెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, తానా బ్యాక్ ప్యాక్ ల పంపిణీ కార్యక్రమం చైర్మన్ లక్ష్మీనారాయణ సూరపనేని ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 31 August, 2009
|