సిలికానాంధ్ర వార్షికోత్సవం
సిలికానాంధ్ర సంస్థ నాలుగేళ్ళుగా నిర్వహిస్తున్న 'మన బడి' కార్యక్రమం ద్వారా తెలుగులో చదవడం, రాయడం, వ్యాకరణం నేర్చుకున్న వారికి తెలుగు విశ్వవిద్యాలయం డిప్లొమాలను ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై గతంలో లేనంతగా విజయవంతం చేయాలని ఎసిఎఫ్ - 2009 చైర్మన్ శ్రీ బుద్ధవరపు ఆహ్వానించారు. తమ సంస్థ నిర్వహిస్తున్న మనబడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేరి తెలుగు భాషను నేర్చుకోవాలని మనబడిని విజయవంతంగా నిర్వహిస్తున్న సిలికానాంధ్ర ప్రస్తుత ప్రెసిడెంట్ రాజు చామర్తి ఆహ్వానించారు.
సిలికానాంధ్ర వార్షికోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమంకన్నా తెలుగుజాతి విశిష్టతను చాటిచెప్పేందుకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ కొండిపర్తి స్పష్టం చేశారు. ఈ గ్లోబల్ తెలుగు ఫ్యామిలీ పేరున జరిగే 'వసుధైక కుటుంబకమ్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల పిలుపునిచ్చారు.
ఇతర వివరాలు కావాల్సిన వారు :
www.siliconandhra.org వెబ్ సైట్ లో గాని, శ్రీ బుద్ధవరపును 408.228.7718 ఫోన్ నంబర్ లో గాని సంప్రతించవచ్చు. ఈ వార్షికోత్సవంలో అతిథులందరికీ ఆంధ్రా సాంప్రదాయ వంటకాలతో రుచికరమైన పూర్తి స్థాయి విందు భోజనం సమకూరుస్తున్నట్లు సిలికానాంధ్ర వైస్ ప్రెసిడెంట్ దిలీప్ కొండిపర్తి తెలిపారు.
Pages: -1- 2 News Posted: 16 September, 2009
|