తెలుగు తేజం కిషోర్ కుంచం న్యూయార్క్ : 'ఏ దేశమేగినా... ఎందు కాలిడినా' అంటూ రాయప్రోలు సుబ్బారావు తెలుగువారి ఔన్నత్యాన్ని చాటుతూ చెప్పిన మాటలు మరోసారి అక్షరాలా రుజువయ్యాయి. అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రుల్లో మరో తెలుగు తేజానికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ రాష్ట్రం లాంగ్ ఐలాండ్ లోని ఫ్రీపోర్ట్ పాఠశాలల సూపరింటెండెంట్ గా డాక్టర్ కిషోర్ కుంచం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఇండో - అమెరికన్ గా కిషోర్ రికార్డులకెక్కారని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం జూలై 1న కిషోర్ ఫ్రీపోర్ట్ పాఠశాలల సూపరింటెండెంట్ గా బాధ్యతలను అధికారికంగా చేపట్టారు.

కిషోర్ కుంచం అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ, కార్పొరేట్ విద్యా రంగంలో విశేష సేవలు అందించారు. విద్యావిధానానికి సంబంధించి ఆయన అడ్మినిస్ట్రేటర్ గా, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లాంటి పలు హోదాల్లో పనిచేస్తున్నారు. డాక్టర్ కిషోర్ కుంచం ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ చేశారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రొఫెషనల్ డిప్లొమా చేశారు.
కిషోర్ కుంచం సాధించిన విజయాల్లో కొన్ని:
- కిషోర్ మార్గదర్శనం వల్ల న్యూయార్క్ రాష్ట్రంలో ఫ్రీపోర్ట్ రేటింగ్ అత్యల్పం నుంచి అత్యధిక స్థాయికి చేరింది
- ఆయన సేవల కారణంగానే 2008లో ఫ్రీపోర్ట్ జిల్లా కంప్ట్రోలర్ కార్యాలయం నుంచి క్లీన్ ఆడిట్ గౌరవం సంపాదించుకుంది
Pages: 1 -2- News Posted: 16 September, 2009
|