తెలుగు తేజం కిషోర్ కుంచం
- శక్తివంతమైన విద్యా విధానం, ఆర్థిక వనరుల పెంపు, సక్రమమైన నిధుల నిర్వహణ లాంటి కార్యక్రమాలను కిషోర్ విజయవంతంగా అమలు చేసినందువల్ల గత ఐదేళ్ళలో మూడు మిలియన్ డాలర్ల పొదుపు సాధ్యమైంది
కిషోర్ కుంచ అందుకున్న అవార్డుల్లో కొన్ని :
- విశిష్ట అడ్మినిస్ట్రేటర్ గా 2009లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ బిజినెస్ అఫీషియల్స్ అవార్డును కిషోర్ కుంచం అందుకున్నారు
- అత్యుత్తమమైన నాయకత్వం లక్షణాలు, విద్యా విధానం, విద్యార్థుల పట్ల ఆదర్శవంతమైన అంకితభావాన్ని ప్రదర్శించినందుకు అత్యంత ప్రతిష్టాకరమైన ఇంటర్నేషనల్ ఈగిల్ అవార్డు కిషోర్ కుంచం గెలుచుకున్నారు
- రోటరీ క్లబ్ నుంచి సివిక్ లీడర్ షిప్ అవార్డు ఆయన సొంతమైంది
- విశిష్ట సేవలకు గుర్తింపుగా అందజేసే అత్యుత్తమమైన న్యూయార్క్ రాష్ట్ర పిటిఎ అవార్డు కిషోర్ కు దక్కింది. దానితో పాటు ఫ్రీపోర్ట్ పిటిఎ కౌన్సిల్ లైఫ్ టైమ్ మెంబర్ షిప్ అవార్డు కూడా కిషోర్ ఖాతాలో చేరింది.
ఇంతే కాకుండా డాక్టర్ కిషోర్ కుంచం అనేక విద్యా, ఆర్థిక, సంగీత, భారతీయ విద్యా భవన్, ఇన్సూరెన్స్ లాంటి అనేక రంగాల్లో ఎనలేని సేవలు అందించారు. ప్రస్తుతం 70 శాతం ఉన్న గ్రాడ్యుయేషన్ లక్ష్యాన్ని 90 శాతానికి చేర్చాలన్న లక్ష్యంతో డాక్టర్ కిషోర్ కుంచం కృషిచేస్తున్నారు. యోగా, మెడిటేషన్ లాంటి అంశాలు సహా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను న్యూయార్క్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇన్ని ప్రసిద్ధ గుణాలతో గణుతికెక్కిన డాక్టర్ కిషోర్ కుంచం మరిన్ని లక్ష్యాలను విజయవంతంగా సాధించాలని నాట్స్ సంస్థ ఆకాంక్షించింది.
Pages: -1- 2 News Posted: 16 September, 2009
|