ప్రవాసాంధ్ర సేవా సమితి నివాళి
ఫిలడెల్ఫియా నుంచి డాక్టర్ ఆదినారాయణ్, వర్జీనియాలో IT డైరెక్టర్ గా ఉన్న కృష్ణ చాగంటి మాట్లాడుతూ, ఆంధ్ర రాజకీయ పరిస్థితులను వేరే రాష్ట్రాలతో పోల్చలేమని, అందువల్ల వేరే రాష్ట్రాలకు ఇది ఆనవాయితీగా మారే అవకాశం ఉందన్న ఒక్క కారణంతో జగన్ కి పదవి నిరాకరించటం భావ్యం కాదన్నారు. శివ చిత్తూరు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికైన 152 మంది MLAల అభిప్రాయాన్ని గౌరవించాలని అన్నారు.
ఈ కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొన్న వక్తలందరూ 'అనుభవ లేమి' అనే ఒక్క కారణం జగన్ కు అడ్డంకి కారాదని, చాల మంది నేతలు అనుభవం లేకుండానే జనరంజకంగా పరిపాలించారని, ఈ విషయంలో ఒబామా ఒక ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. ఈ కాన్ఫరెన్స్ కాల్ లో న్యూజెర్సీ లో కాన్సర్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఆశా గుట్టపల్లి, న్యూయార్క్ లో కార్డియాలజీ ఫెలో షిప్ గా పనిచేస్తున్న శ్రీమతి స్వప్న నిమిషకవి, ఫ్లోరిడా నుంచి శ్రీమతి పద్మ ఎర్రాప్రగడ, శ్రీమతి స్వాతి చిత్తూర్, శ్రీ వంశీ మోహన్ ఒంటెద్దు, శ్రీ మహేష్ పసుపులేటి , ఈడ్పుగంటి యాకోబు తదితరులు పాల్గొని జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
అమెరికా ప్రవాసాంధ్ర సేవా సమితి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసంక్షేమ పథకాల అమలులో ఆర్థిక, సామాజిక సహకారం అందచేసేందుకు ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న ఒక సంఘం. సమైక్యాంధ్ర, జలయజ్ఞం సాధనకు సమితి కృషి చేస్తుంది.
Pages: -1- 2 News Posted: 17 September, 2009
|