షికాగోలో 'ధూంధాం'
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/Chicago-TNight-10-01.jpg' align='center' alt=''>
షికాగో: తెలంగాణలో పల్లెపల్లెనూ కదిలిస్తున్న ప్రత్యేక రాష్ట్ర నినాదం నేపర్విల్ లోనూ ప్రతిధ్వనించింది. నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది తెలంగాణ ప్రవాసులు ఆటపాటలతో నిర్వహించిన 'తెలంగాణ నైట్' ధూంధాంగా సాగింది. ఎముకలు కొరికే చలిలోనూ వేడి పుట్టించింది. షికాగో సమీపంలోని నేపర్విల్ వి.ఎఫ్.డబ్ల్యు. బాంక్వెట్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లినాయి నుంచే కాకుండా మిషిగన్, విస్కాన్సిన్, ఒహాయో రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా తెలంగాణవాదులు పిల్లాపాపలతో పాల్గొన్నారు. తల్లి తెలంగాణ విగ్రహం ఎదుట జ్యోతి వెలిగించి, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అసువులుబాసిన అమరుల ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించడం ద్వారా కార్యక్రమం మొదలయింది.
అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతంగా భావించే 'జయజయహే తెలంగాణ' ఆలాపనతో కార్యక్రమం ముందుకు సాగింది. 'స్పిరిట్ ఆఫ్ తెలంగాణ' స్లైడ్ షో అందరిలోనూ ఒక్కసారిగా తీపి, చేదు జ్ఞాపకాలను రగిల్చింది. మాతృభూమిలో స్వయంపాలన కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ప్రవాసంలోని తెలంగాణవాదులను ఒకచోటికి చేర్చి, వెనుకబడిన తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించవలసిన అవసరాన్ని గుర్తుచేయడంలో ఈ సమావేశం విజయం సాధించిందని షికాగో తెలుగు అసోసియేషన్ మీడియా కమిటీకి చెందిన మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/Chicago-TNight-10-02.jpg' align='center' alt=''>
Pages: 1 -2- News Posted: 11 January, 2010
|