షికాగోలో 'ధూంధాం'
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/Chicago-TNight-10-03.jpg' align='center' alt=''>
తెలంగాణ దరువుతో పాడిన పల్లె పాటలకు పిల్లలూ పెద్దలూ సమాన ఉత్సాహంతో నృత్యం చేశారు. 'మాభూమి' సంధ్య ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్ద్రత, ఆవేశాలను సమపాళ్లలో కలిపి ఆమె పాడిన 'రేలా రే రేలా', 'తెలతెలవారగ' పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. చాలాకాలం క్రితం మాతృభూమిని వదిలి వచ్చిన వారిని, ముఖ్యంగా 1969 విమోచనోద్యమంలో పాల్గొన్నవారిని ఈ పాటలు జ్ఞాపకాల ఊయల ఎక్కించాయి. అర్ధరాత్రి దాటేదాకా ఈ కార్యక్రమం కొనసాగింది.
బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణలో ఎప్పుడూ ముందుండే షికాగో ప్రవాసులు ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ సామూహికంగా కృషిచేయడం వల్లనే తక్కువ సమయంలో జయప్రదం చేయగలిగామని మహేశ్ పేర్కొన్నారు.
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/Chicago-TNight-10-04.jpg' align='center' alt=''>
Pages: -1- 2 News Posted: 11 January, 2010
|