టిఎఫ్ఎఎస్ చైతన్య దీపికలు
న్యూజెర్సీ : నేటి యువతే రేపటి భావి పౌరులుగా రుజువు చేశారు న్యూజెర్సీలోని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీకి చెందిన యువతీ యువకులు. బ్రిడ్జివాటర్ టెంపుల్ లో జనవరి 23న తెలుగు కళాసమితి నిర్వహించిన సంక్రాంతి సంబరాలను టిఎఫ్ఎఎస్ యువత ఉత్సాహంగా ముందుకు వచ్చి విజయవంతంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో చిన్నారులకు ఉచిత ప్రవేశంతో పాటు పలు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. టిఎఫ్ఎఎస్ ట్రస్టీల మార్గదర్శనంలో జరిగిన 2010 సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పోటీల్లో 200 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్న ఈ సంబరాల్లో 500 మంది వరకు అతిథులు సంతోషంగా హాజరయ్యారు. ఊదయం 10 గంటలకు ప్రారంభమైన టిఎఫ్ఎఎస్ సంక్రాంతి సంబరాలు నిర్ణీత సమయం సాయంత్రం 6.30 గంటలకు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి.
ఈ సంబరాలకు వలంటీర్లుగా అమూల్య ఉప్పల, పవన్ గేదెల, సుమ గొంది, అనూజ గేదెల, ప్రశాంత్ భార్గవ, వరుణ్ శ్రీకాంత్, ప్రత్యూష రాయవరపు, శిఖ చివుకుల, మీనా మల్లెల, రవి ఆకెళ్ళ, హనీష్ పోలవరపు, సుమ ఆకెళ్ళ, ఐశ్వర్య వెంకటేష్, సప్న సుందర్, అన్వేష్ అన్నదానం, వంశీ సూర్యదేవర వలంటీర్లుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టిఎఫ్ఎఎస్ కార్యనిర్వాహకవర్గం తెర వెనుక ఉండి ఈ సంబరాలను యువత చేతుల మీదుగా నడిపించింది. యూత్ ట్రస్టీ గిరిజ కొల్లూరి సహాయ సహకారాలతో ఈవెంట్ ట్రస్టీ మంజు భార్గవ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. శాస్త్రీయ, జానపద నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్ ల పోటీ, తెలుగు పద్యాల వల్లె వేయడం, తెలుగు టెక్స్ట్ చదవడం, వాయిద్య సంగీతం, పాటలు, స్కిట్స్, బొమ్మలకొలువు, రంగోలి విభాగాల్లో పోటీలను నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలు సహా అన్ని వయస్సుల వారికి పోటీలు జరిగాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ టిఎఫ్ఎఎస్ ట్రోఫీలు బహూకరించారు. ట్రోఫీలను అందజేసిన డాక్టర్ సత్యవేణికి, బహుమతులు సమకూర్చిన డాక్టర్ సునీత కనుమూరి, కాశీనాధుని ఫౌండేషన్ కు చెందిన సాంబశివరావు, శ్రీమతి రాధకు టిఎఫ్ఎఎస్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 28 January, 2010
|