టిఎఫ్ఎఎస్ చైతన్య దీపికలు
టిఎఫ్ఎఎస్ కార్యనిర్వాహకవర్గ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్ళలోనే తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని, స్నాక్స్ ను సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆహూతులకు సరఫరా చేశారు. కార్యక్రమానికి చక్కని సౌండ్ సిస్టాన్ని మణి ఆకెళ్ళ సమకూర్చారు. టిఎఫ్ఎఎస్ మెంబర్స్ చైర్ పర్సన్ లక్ష్మి మల్లెల, కోశాధికారి ఇందిర యలమంచి, కమ్యూనిటీ సేవల ట్రస్టీ రోహిణీ కుమార్ లు ఇతర వలంటీర్ల సహాయ సహకారాలతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంక్రాంతి సంబరాల పోటీలను సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ శీతల విజయవంతంగా జరిగేలా చూశారు. ఆహారం, బహుమతుల ప్రదానం కార్యక్రమాలు సంస్థ కార్యదర్శి ఆనంద్ పాలూరి విజయవంతంగా జరిగేలా చూశారు. యూత్ వలంటీర్లు అందించిన సేవలకు గాను వారికి బహుమతితో పాటు సర్టిఫికెట్ ను అందజేశారు. పోటీల విజేతలకు బహుమతులను టిఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ దాము గేదెల చేతుల మీదుగా అందజేశారు. ఆనంద్ పాలూరి, శ్రీనివాస్ గనగోని, వసంత్ నాయుడు, సురేష్ మాకం, అనంత సుధాకర్ ఉప్పల వందన సమర్పణ చేశారు.
Pages: -1- 2 News Posted: 28 January, 2010
|