డైమండ్ జూబ్లీ రిపబ్లిక్ డే
కాలిఫోర్నియా : భారత రిపబ్లిక్ డే డైమండ్ జూబ్లీ మహోత్సవాలను తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఇక్కడ ఘనంగా నిర్వహించింది. ఫ్రీమాంట్ లోని షాన్ ఇండియన్ రెస్టారెంట్ లో విందు భోజనంతో పాటు నిర్వహించిన భారత గణతంత్ర డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ప్రవాసాంధ్రులు ఆనందోత్సాహాలతో విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ మహోత్సవ కార్యక్రమాన్ని వాసవీ టెక్నాలజీస్ కార్పొరేషన్, రవి ట్యాక్స్ సర్వీసెస్ సంస్థలు స్పాన్సర్ చేశాయి.
భారత జాతి పిత పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ చిత్రపటం ముందు పలువురు చిన్నారులు జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి కేక్ కట్ చేసి ఉత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అతిథులకు టిసిఎ ప్రధాన కార్యదర్శి రాజు యాసల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్ గట్టు మాట్లాడుతూ, భారతదేశం ప్రాశస్త్యాన్ని వివరించారు. స్వాతంత్ర్యం సాధించిన ఈ 60 సంవత్సరాల్లో భారత్ శక్తివంతమైన దేశంగా ఎలా రూపుదిద్దుకున్నదనే అంశాలను ప్రస్తావించారు. శ్రీవల్లి తదితర చిన్నారులు భారతదేశం, అమెరికా జాతీయ గీతాలను హృద్యంగా ఆలపించారు. చిన్నారు తమ దుస్తులపైన ధరించిన పతాకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల సభ నిర్వహించిన బాంక్వెట్ హాలు మొత్తం భారతదేశం, అమెరికా జాతీయ పతాకాలతో కనులవిందుగా అలంకరించారు. పెద్దలంతా భారత్ - అమెరికా దేశాల అత్యున్నత సంస్కృతి ప్రతిబింబించేలా వస్త్రధారణతో ఉత్సవాలకు హాజరయ్యారు.
Pages: 1 -2- News Posted: 5 February, 2010
|