భారత డైమండ్ రిపబ్లిక్ డే
గత రెండేళ్ళుగా తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సంస్థ అధ్యక్షుడు బిక్షం పాలబిందెల వివరించారు. టిసిఎ నూతన లోగోను విజయ్ చవ్వ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ కళాకారుడు యాసల బాలయ్య కుమారుడు, యానిమేటర్ ప్రకాష్ యాసల ఈ సరికొత్త లోగోను రూపొందించారు. ఈ సందర్భంగానే 'తెలంగాణ జానపద గేయాలు' సిడిని కూడా ఆవిష్కరించారు. డాక్టర్ సురేందర్ రెడ్డి ఈ సీడీకి రూపకల్పన చేయగా, ఆవిష్కరించేందుకు టిసిఎ సహాయ సహకారాలు అందించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ బాటా ప్రెసిడెంట్ ప్రసాద్ మంగిన తమ సంస్థ తరఫున శుభాభినందనలు తెలిపారు. అత్యున్నతమైన భారతదేశ సంస్కృతి గురించి సురేష్ వుయ్యూరు, జగన్ బైరెల్లి, యుగంధర్ ప్రసంగించారు. సైదేష్ అజ్జన్ వందన సమర్పణతో భారత రిపబ్లిక్ డే డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఉల్లాసంగా ముగిశాయి. చక్రి, భాస్కర్ మద్ది, భాస్కర్ కె. సైదేష్ అజ్జన్, రమేష్ గుబ్బ, సురేందర్ పెంచల, శ్రీధర్ గుర్రం, దయానంద్, రేణుక చవ్వ, అనిత పాలబిందెల, శ్రవణ్ బెల్లాల్ ఈ ఉత్సవాలు విజయవంతంలో కావడంలో చక్కని సహాయ సహకారాలు అందించారు.
Pages: -1- 2 News Posted: 5 February, 2010
|