'చిరుగాలి' ప్రభంజనం
వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నకల్లో చిరంజీవి ప్రభంజనం ముందు విపక్షాలన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్వేలలో ప్రసిద్ధి చెందిన 'ది ట్రూ పోల్ సర్వే' ఈ విషయం తేల్చి చెప్పిందని ఆయన తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ట్రూ పోల్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. పోల్ సర్వే, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పిఆర్పి మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరకాల ప్రభాకర్ విశ్లేషణ, ఇటీవల తాము నిర్వహించిన ఎన్నారై కార్యక్రమాలు, ప్రపంచ వ్యాప్తంగా తమకు అందిన పిటిషన్లు చిరు గాలి ప్రభంజనం అవుతుందని స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వోటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు ప్రజారాజ్యం పార్టీ నియమించిన ది ట్రూ పోల్ సర్వే రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 లోక్ సభా నియోజకవర్గాల్లోనూ కలిపి మొత్తం 35 వేల మంది అర్హులైన వోటర్ల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిందని, సిఎన్ ఎన్, ఐబిఎన్ చెప్పినట్లుగా చిరంజీవి తరఫున కేవలం 7 శాతం మంది కాక 70 శాతం మంది పూర్తి మద్దతును ప్రకటించారని శ్రీనివాస మానాప్రగడ స్పష్టం చేశారు. వోటర్ల ఆదాయం, విద్య, కులం, వృత్తి, మత సంబంధమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సర్వే సంస్థ తాను ప్రశ్నించే వారిని ఎంపిక చేసిందన్నారు.
Pages: 1 -2- News Posted: 3 March, 2009
|