తానా సభల తారాగణం
షికాగో: ఒక భారీ బడ్జెట్ సినిమాకు సరిపోయే తారాగణం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు హాజరవుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకకు సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా భారీ తారాతోరణాన్ని మోపు చేస్తున్నారు. జూలై 2 నుంచి మూడు రోజులపాటు షికాగో రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న 17వ మహాసభలకు హీరో హీరోయిన్లు జూనియర్ ఎన్టీఆర్, ఛార్మి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు పౌరసంబంధాల కమిటీ చైర్మన్ కాశి పాటూరి తెలిపారు. తానాలో ఆధిపత్య పోరు ఇటీవలే ముగిసి, రెండు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఇక మహాసభల నిర్వహణపై దృష్టి సారించారు.
సభలను కలకాలం గుర్తుండిపోయేంత ఘనంగా నిర్వహించేందుకు స్టీరింగ్ కమిటీ ఈనెల రెండవ వారంలో రోజ్ మాంట్ ఎంబసీ సూట్స్ లో సమావేశమయింది. అన్ని కమిటీల సారథులు సమావేశమై సభలను విజయవంతం చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రభాక చౌదరి కాకరాల అన్ని కమిటీల ప్రణాళికలను, వాటి అమలుకు తీసుకోబోయే చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో తానా కోశాధికారి మోహన్ నన్నపనేని, తానా ఫౌండేషన్ చైర్మన్ లోకేశ్వర రావు ఈదర, షికాగో సభల సమన్వయకర్త యుగంధర్ యడ్లపాటి తదితరులు పాల్గొని మార్గదర్శనం చేశారు.
Pages: 1 -2- News Posted: 20 March, 2009
|