టిడిపి ఆవిర్భావ దినోత్సవం
న్యూజెర్సీ : తెలుగుదేశం పార్టీ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రమణ గన్నె ఏర్పాటు చేశారు. గీత యాంకర్ గా వ్యవహరించిన టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని శైలజ అడ్లూరు, ప్రియ కొత్తపల్లి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కావడానికి గల ఆవశ్యకత, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీరామారావు, ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబునాయుడి నాయకత్వంలో ఇంతవరకూ ఆ పార్టీ సాధించిన విజయాలను హేమంత్ దొడ్డపనేని కూలంకషంగా గుర్తు చేశారు. హేమంత్ దొడ్డపనేని ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ ఉత్సవాల సందర్భంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు జీవిత చరిత్రపై తీసిన 'సరి లేరు నీకెవ్వరూ' అనే చక్కని డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం ప్రస్తుత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపైన కూడా మరో డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. పార్థసారథి, సౌజన్య, హిమబిందు, రాజీవ్ లు నిర్వహించిన సంగీత విభావరికి ఆహూతుల నుంచి అనూహ్యమైన ప్రతిస్పందన లభించింది. ముఖ్యంగా నరసింహనాయుడు, పోకిరి, యమదొంగ చిత్రాలలోని పాటలను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదించారు. గాయనీ గాయకులకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. సంగీత విభావరి పూర్తయిన వెంటనే లాలస, నటాషా, శైలజ, దివ్య, శిల్ప, అంకిత, అనీష్, మనీష్ అనే చిన్నారులు తమ కళా ప్రదర్శనలతో ఆహూతులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. ప్రత్యేకంగా యమదొంగ చిత్రంలోని 'రబ్బరు గాజులు' పాటకు నితీష, నిషాంత్ ఏలూరి చేసిన డ్యాన్సులు ప్రతి ఒక్కరూ ఎంతగానో అలరించాయి.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|