స్ఫూర్తిదాయకం చిరు ప్రసంగం
న్యూజెర్సీ : చిరంజీవిలో అదే స్ఫూర్తి... అదే స్పృహ... ఎప్పుడూ సమున్నతమైన ఆలోచనే... ఎల్లప్పుడూ సముచితమైన నిర్ణయాలే... బుధవారంనాడు అసెంబ్లీలో తిరుపతి శాసనసభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష నేత కొణిదెల చిరంజీవి చేసిన ప్రసంగం ఆసాంతం సభలో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 'ప్రజా సమస్యలపై సత్వరం ప్రతిస్పందిస్తే, వెనువెంటనే పరిష్కరించేందుకు కృషిచే స్తే, వారి బాగోగులపై శ్రద్ధ వహిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీయే ఎల్లకాలమూ అధికారంలో ఉండగలుగుతుందని చిరంజీవి పేర్కొనడం ఆయన సామాజిక స్ఫూర్తికి నిదర్శనం. ఎప్పుడు ఆ పార్టీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించినా, ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామం'టూ చిరంజీవి చేసిన చాలెంజ్ అందరినీ ఆకట్టుకొన్నదని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాము ప్రస్తావించిన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తే, నిర్లక్ష్యం వహిస్తే ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం తారుమారవడం తథ్యం అంటూ చిరంజీవి వైఎస్ సర్కార్ కు చేసిన బహిరంగ సవాల్ చేయడం గమనార్హం. 'ర్యాగింగ్ వినోదంలో ఒక భాగం' అంటూ చిరంజీవి సభలో చమత్కరించడం ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనం. కళాశాలలో చేరిన జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడం ఒక సరదా మాత్రమే అని, ఇది అందరి మధ్యా స్నేహభావాన్ని పెంపొందిస్తుందనడంలో ఆయన సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదన్నారు. సభలో తాను జూనియర్ అయినందున ర్యాగింగ్ చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నానన్న చిరు స్పోర్టివ్ స్పిరిట్ అందరినీ ఆకట్టుకున్నదని శ్రీనివాస మానాప్రగడ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 11 June, 2009
|