న్యూజెర్సీలో నాట్స్ ప్రమోషన్
న్యూజెర్సీ : ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగువారి కోసం తెలుగువారు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) న్యూజెర్సీలో నిర్వహించిన తెలుగు సంబరాల ప్రమోషన్ కార్యక్రమం విజయవంతమైంది. జూన్ 14వ తేదీన న్యూజెర్సీ ఇసెలిన్ లోని దక్షిణ్ రెస్టారెంట్ లో నిర్వహించిన ఈ ప్రమోషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాట్స్ సభ్యులు, స్థానిక ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. నాట్స్ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రవాసాంధ్రులకు పలు సేవలు అందిస్తోంది. తెలుగు సంబరాల ప్రమోషన్ కార్యక్రమాన్ని మోహనకృష్ణ మన్నవ, అనిల్ బొప్పుడి నిర్వహించారు. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉంటూ విశ్రాంతి తీసుకునే ఆదివారంనాడు ఉత్సాహంగా హాజరైన అతిథులందరికీ అనిల్ స్వాగతం చెప్పారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు కూడా తెలిపారు. అతి తక్కువ సమయంలో ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని తాము తలపెట్టినప్పటికీ, ఆహ్వానం పలికేందుకు కూడా తగినంత సమయం లేకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో నాట్స్ సంస్థ మద్దతుదారులు, అతిథులు హాజరై విజయవంతం చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించిన మోహనకృష్ణ మన్నవ నాట్స్ సంస్థ లక్ష్యాలను వివరిస్తూ ఇంతవరకూ సంస్థ చేసిన సేవలు, భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. జూలై 2,3,4 తేదీల్లో ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో నిర్వహించనున్న 'అమెరికా తెలుగు సంబరాలు' ఏర్పాట్ల గురించి తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 20 June, 2009
|