ఆంధ్రా జ్యోతిబసు వైఎస్సార్
కెంటకి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 60 జన్మదినోత్సవాలను వైఎస్సారా యువసేన యుఎస్ కమిటీ జూలై 11 శనివారంనాడు అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా నిర్వహించింది. వైఎస్సార్ యువసేన యుఎస్ ఎ కమిటీ హెడ్ క్వార్టర్స్ ఉన్న కెంటకి రాష్ట్రంలోని బౌలింగ్ గ్రీన్ లో ప్రధాన ఉత్సవం నిర్వహించారు. నిజానికి జూలై 8న వైఎస్ పుట్టినరోజు అయినప్పటికీ పనిదినం కావడంతో శనివారంనాడు వేడుకలు నిర్వహించినట్లు వైఎస్సార్ యువసేన కమిటీ వివరించింది. కాకతాళీయంగా వైఎస్సార్ పుట్టినరోజు - పశ్చిమ బెంగాల్ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పుట్టిన రోజు కూడా జూలై 8వ తేదీయే కావడం కాకతాళీయం. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన యువసేన కార్యకర్తలంతా పశ్చిమబెంగాల్ ను 25 ఏళ్ళు పరిపాలించిన జ్యోతిబసు కంటే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికై అధికారంలో ఉండాలని అభిలంషించారు. కెంటకి రాష్ట్రం పరివ్యాప్తంగా ఉన్న 10 వైఎస్సార్ యువసేన రాష్ట్ర కమిటీల ఇన్ చార్జులు, వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, వారి కుటుంబాలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆ రోజు ఉదయం వైఎస్సార్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆంధ్ర రాష్ట్రం మరింతగా అభివృద్ధిపథంలో దూసుకుపోవాలని, సంక్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యువసేన ప్రత్యేకంగా ప్రార్థనలు, పూజలు నిర్వహించింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూడు మతాల నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు స్థానిక వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం పట్ల పలువురు అమెరికన్లు అమిత ఆశ్చర్యం, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక భారతీయ నాయకుడి స్ఫూర్తితో అమెరికాలోని వైఎస్సార్ యువసేన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విధానం గురించి వృద్ధాశ్రమం మేనేజర్ రాబర్ట్ యార్క్ వివరాలు అడిగి విస్మయం వ్యక్తం చేశారు.
Pages: 1 -2- News Posted: 13 July, 2009
|