సిలికానాంధ్ర' సంగీత శిబిరం
సన్నీవేల్, కాలిఫోర్నియా: సిలికానాంధ్ర సంస్థ నిర్వహించే వైవిధ్యభరితమైన కార్యక్రమాలు, చేసే ప్రయోగాలు ఏ తెలుగువాడికీ కొత్తకాదు. ఈ నేపధ్యంలో సిలికానాంధ్ర చేపట్టిన మరొక కొత్త ప్రాజెక్టే ఈ లలితసంగీత శిక్షణా శిభిరం. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఆలోచనకు కార్యరూపం ఇచ్చిన కూచిభట్ల ఆనంద్ ప్రతిభకు ఇది మరో నిదర్శనం. వందమంది విద్యార్థులను మూడు బ్యాచిలలో సమీకరించి ఉదయం నుంచీ రాత్రి తొమ్మిది గంటలవరకు, 3 వారాలో ముగిసే ఈ శిబిరం ఒక కార్యక్రమం కాదు. ఇది ఒక లలిత సంగీత విద్యాలయం. ఒక మహత్తర సంకల్పం.
అమెరికాలోని తెలుగువారికి లలిత సంగీతం నేర్పించాలన్నది సిలికానాంధ్ర సంకల్పం. దీని కోసం శ్రీ రామాచారిని ప్రత్యేకంగా అమెరికాకు రప్పించింది. ఈ జ్ఞానదానానికి హైదరాబాద్‌లో లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీని నడుపుతున్న రామాచారిగారిని మించిన మరొక గురువు లేరనడం అతిశయోక్తికాదు. వచ్చిన మరుదినమే ఆయన కార్యనిమగ్నులై ఏ ప్రతిఫలమూ ఆశించకుండా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి దాదాపు వందమందికి పైగా లలిత సంగీతాన్ని నేర్పిస్తూ, సామాన్యంగా ఏ గురువూ నేర్పని కొత్త మెళుకువలను అందిస్తూ, అతితక్కువ కాలంలోనే అందరికి దగ్గరయ్యారు రామాచారిగారు. మైకులోకి ఎలాపాడాలి, పాడేటప్పుడు శ్వాస ఎలా తీసుకోవాలి, భావ వ్యక్తీకరణ ఎలా వుండాలి, భాషాఉచ్చారణ ఎలావుండాలి అనేటువంటి అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూ అందరినీ ప్రభావితం చేస్తూ సంగీతం నేర్పుతున్నారు ఆయన. ఈ శిక్షాణా శిబిభిరానికి అతిధి ఉపన్యాసకులుగా నేడు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణిగారు, అలాగే ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ గార్లు విచ్చేయడం ఒక విశేషం.
Pages: 1 -2- News Posted: 24 July, 2009
|