వైఎస్సార్ యువసేన నివాళి స్మిత్ విల్లె : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతికి సంతాపంగా వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ సంస్మరణ సభ నిర్వహించింది. టెన్నిస్సీ రాష్ట్రంలోని స్మిత్ విల్లె నగరంలో సెప్టెంబర్ 7 సోమవారం మధ్యాహ్నం 2.51 గంటలకు ఈస్ట్ సైడ్ ఇన్ హొటల్ లో నిర్వహించిన ఈ సంతాపసభలో వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో, బరువెక్కిన హృదయాలతో పాల్గొన్నారు. అఖిలాంధ్రులే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న తమ నాయకుడి అకాల మరణం పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల మృత్యువు అపహరించుకుపోయిన తమ అభిమానా నాయకుడు వైఎస్ తో పాటు అదే హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన మిగిలిన నలుగురికి, వైఎస్ మరణ వార్త విని 400 మందికి పైగా ప్రాణాలు వదిలారని, వారికి కూడా ఈ సంతాపసభలో వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ శ్రద్ధాంజలి ఘటించింది. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా భగవంతుడిని యువసేన ప్రార్థనలు చేసింది.
ఈ సందర్భంగా స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో దశాబ్దానికి పైగా ఉన్న తన అనుబంధం గురించి, ఆయన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై తాను కూడా పాలుపంచుకొనే అవకాశం కలిగిన విషయాన్ని వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి కన్నీళ్ళ మధ్య గుర్తు చేసుకున్నారు. 2002, 07 సంవత్సరాల్లో వైఎస్ అమెరికా సందర్శించినప్పుడు తాను ప్రముఖ పాత్ర వహించే అదృష్టం కలిగిందని మననం చేసుకున్నారు. తనను చిన్న సోదరుడిగా వైఎస్ ఎప్పుడూ ఆదరించేవారని ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 8 September, 2009
|