హ్యూస్టన్ లో శ్రీశ్రీ శతజయంతి

హ్యూస్టన్ : హ్యుస్టన్ సాంస్కృతిక సమితి వారి సాహితీ విభాగం ఆధ్యర్యంలో 'నెలా నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం శనివారం సాయంత్రం అంజలి సెంటర్ లో జరిగింది. ఈ నెల మొదటి వార్షికోత్సవంలో హ్యూస్టన్ లోని సాహితీ మిత్రులు మహాకవి శ్రీ శ్రీ శత జయంతి వేడుక నిర్వహించారు. ఈ నెల వెన్నెలకి స్వయంగా శ్రీశ్రీ సతీమణి శ్రీమతి సరోజా శ్రీశ్రీ, శ్రీశ్రీ రెండవ పుత్రిక శ్రీమతి మంగళ శ్రీరంగం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
సుధేష్ పిల్లుట్ల సభకు స్వాగతం పలికారు. ఏడాది పుత్రిక 'నెల నెలా తెలుగు వెన్నెల' చిరు చరిత్రను వివరించారు. తెలుగు సాంస్కృతిక సమితి సాహిత్య కార్యదర్శి శ్రవణ్ అర్ర ఈ సంబరాలకు ప్రధాన కార్యనిర్వాహకునిగా వ్యవహరించారు. కార్యక్రమాన్నిఆయన నిర్వహించారు.
సుధేష్ పిల్లుట్ల ముందుగా ప్రసంగిస్తూ శ్రీశ్రీ జీవిత చరిత్రను సంక్షిప్తంగా వివరించారు. తరువాత యువ కవి 'రానారే' రామనాధరెడ్డి శ్రీశ్రీ కవిత, జీవితం తనలాంటి యువకులను ఎలా ప్రభావితం చేశాయో స్పష్టం చేశారు. పది మంది యువకులు 'అంతర్జాతీయ బ్లాగ్గుల్లో' శ్రీశ్రీ పంథాలో కవిత్వం రాస్తే ఆయన చిరంజీవి అవుతారని అన్నారు. రాయలసీమ మాండలికంలో చేసిన రానారే ప్రసంగం అందరినీ ముగ్ధులను చేసింది.
సత్యం మందపాటి రచించిన 'శ్రీశ్రీలో హాస్యరసం' వ్యాసాన్ని సాయి రాచకొండ చదివి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. అమెరికా హాస్య బ్రహ్మ వంగూరి చిట్టెన్ రాజు శ్రీశ్రీ, సరోజాతో 1981లో హ్యూస్టన్ నగరానికి వచ్చి తన ఇంట్లో బసచేసినప్పటి మధుర స్మృతులను పునరావలోకనం చేసుకున్నారు.
Pages: 1 -2- News Posted: 23 September, 2009
|