న్యూజెర్సీ బతుకమ్మ పండుగ

న్యూజెర్సీ : తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండుగను న్యూజెర్సీలోని డొనాల్డ్ సన్ పార్క్ లో ఉల్లాసకర వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించారు. న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలకు చెందిన అన్ని వయస్సులకు సంబంధించిన సుమారు 250 కుటుంబాలు, భక్తులు బతుకమ్మ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యూజెర్సీ అసెంబ్లీ ప్రతినిధి ఉపేంద్ర చివుకుల, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, చలనచిత్ర దర్శకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు వడ్డేపల్లి కృష్ణ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎర్రబెల్లి మనోహర్ రావు, అర్జున్ రెడ్డి ద్యాప, దామోదర్ గేదల, రాజేశ్వర్ రెడ్డి గంగసాని, ఆనంద్ పాలూరి, సతీష్ దాసరి, భగవాన్ రెడ్డి పింగళి, మహేందర్ ముసుకు, డాక్టర్ ప్రేమ్ నందివాడ, దత్తురెడ్డి, ఇతర ప్రవాసాంధ్ర ప్రముఖులెందరో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రలోని తెలంగాణ ప్రాంతంలో దొరికే విధంగా గునుగు, తంగేడు తదితర పూలు అమెరికాలో లభ్యం కాకపోవడంతో తమకు అందుబాటులో ఉన్న పూలతోనే బతుకమ్మలను ఏర్చి కూర్చేందుకు మహిళలు, పిల్లలు ఎంతో శ్రమించారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సాంప్రదాయ రుచులతో ఏర్పాటు చేసిన భోజనంతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ విందు భోజనానికి కొన్ని వంటకాలను స్పాన్సర్ చేసిన రెస్టారెంట్ లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. విజిటబుల్ ఫ్రైడ్ రైస్, రకరకాల పులిహోరలు, పెరుగన్నం, మిఠాయిలు లాంటి మొత్తం 20 రకాల పదార్థాలు ఈ భోజనంలో అందుబాటులో ఉంచారు.
Pages: 1 -2- News Posted: 26 September, 2009
|