ఆకట్టుకున్న సాహితీ సదస్సు

డల్లాస్ : తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, తెలుగు సాహిత్య వేదిక 23వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సును, 27వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమాన్ని సంయుక్తంగా స్థానిక ఓమ్ని ఫోర్ట్ వర్త్ హోటల్ లో అక్టోబర్ 18న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, కుమారి గంటి నీహారిక ఆలపించిన 'మా తెలుగుతల్లికి' గేయంతో సభ ప్రారంభమైంది. ఈ సభని మూడు విభాగాలుగా నిర్వహించారు.
మొదటి విభాగంలో మందపాటి సత్యం త్రిపురనేని గోపీచంద్ రచనల గురించి ప్రసంగించారు. అనంతరం లక్ష్మన్న విష్ణుబొట్ల కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం గురించి, చంద్రహాస్ మద్దుకూరి శ్రీశ్రీ రచనల పైన ప్రసంగించారు. వంగూరి చిట్టెన్ రాజు శ్రీశ్రీ మీద ప్రసంగించిన తరువాత, శ్రీశ్రీ స్వయంగా మాట్లాడిన వీడియోని ప్రదర్శించారు.
ఆ తరువాత డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి శ్రీశ్రీ మీద రాసిన సిరిసిరిమువ్వ పద్యాలు వినిపించారు. శ్రీశ్రీ రచించిన 'సిప్రాలి' శతక పద్యాల పుస్తకాన్ని, అమెరికా తెలుగు పుస్తక సమాఖ్యని వంగూరి ఫౌండేషన్ నిర్వాహకులు కేతు విశ్వనాథరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. సాజి గోపాల్ ఇటీవల మరణించిన మనవ హక్కుల పోరాట యోధుడు కందాళ బాలగోపాల్ మీద ప్రసంగించారు.
Pages: 1 -2- News Posted: 23 October, 2009
|