ఘనంగా కనెక్టికట్ దీపావళి

కనెక్టికట్ : 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ (టాక్ట్)'- దీపావళి సంబరాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నవంబర్ 1న మిడిల్ టౌన్ హై స్కూల్ లో అత్యంత వైభవంగా జరిగాయి. గతంలో జరిగిన అనేక కార్యక్రమాల కంటే అత్యధిక సంఖ్యలో సుమారు 120 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఆట పాటలతో ఉర్రూతలూగించారు. 450 మందికి పైగా ప్రేక్షకులు సుమారు 6 గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని ఆద్యంతమూ ఆనందంలో మునిగితేలారు.

దీపావళి సంబరాల్లో భాగంగా సుమారు రెండున్నర గంటల పాటు సాగిన శ్రీనిధి, రఘురాం లైవ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. గణేశ ప్రార్ధనతో మొదలైన కార్యక్రమం పిల్లల 'ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్ తో విశేషంగా ఆకట్టుకుంది. జూనియర్స్ లో శ్రీచరన్ పల్ల, ఆర్ణవ్ పట్లోల్ల, వైభవ్ తిరునగరి, సీనియర్స్ లో సహజ కరబత్తుల, గాయత్రి శివలెంక, శ్రీరాం అలవాల విజేతలుగా నిలిచారు.
Pages: 1 -2- News Posted: 5 November, 2009
|