తానా సాంస్కృతిక పోటీలు శాన్ జోష్ (చికాగో) : ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు యువతీ యువకులకు ప్రోత్సహించడంతో తమ సంస్థ ముందున్నదని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు జయరామ్ కోమటి స్పష్టం చేశారు. ప్రవాస తెలుగు యువత తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకునేందుకు వీలుగా తానా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. ఈ సంవత్సరం తొలినాళ్ళలో తానా - మాటీవీ ఉత్తర అమెరికా వ్యాప్తంగా 'తానా - మా టీవీ సూపర్ సింగ్ కాంటెస్ట్' నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ప్రతిభావంతులైన యువ సంగీత కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసినట్లు జయరామ్ కోమటి పేర్కొన్నారు.
తానా - మాటీవీ సూపర్ సింగ్ కాంటెస్ట్ విజయవంతం కావడంతో ఇప్పుడు టివి 9, మాటీవీలతో సంయుక్తంగా ఉత్తర అమెరికాలోని తెలుగు పెద్దలు, యువతీ యువకులకు పలు సాంస్కృతిక పోటీలను నిర్వహించాలని తాజాగా నిర్ణయించినట్లు తానా అధ్యక్షుడు జయరామ్ కోమటి స్పష్టం చేశారు. ఈ పోటీల్లో భాగంగా క్విజ్, వక్తృత్వపోటీ, మిమిక్రీ, డ్యాన్స్, హాస్యం, మైమ్, పాటలు తదితర అంశాల్లో వచ్చే కొద్ది నెలల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలను 2011లో జరిగే 18వ తానా మహాసభల సందర్భంగా సన్మానిస్తామని జయరామ్ కోమటి పేర్కొన్నారు.
'తెలుగు ఫర్ ఎవ్విరి వన్' పేరిట నిర్వహించే తెలుగు భాష అభ్యసన కార్యక్రమంలో భాగంగా తెలుగు నేర్చుకునే వారికి సరైన బోధనా విధానాలను అందుబాటులో ఉంచుతున్నట్లు, ఆరోగ్య బీమా సౌకర్యం లేని తెలుగు వారికి సహాయం చేసేందుకు 'తానా ఫిజీషియన్స్ నెట్ వర్క్' లాంటి పలు సేవా కార్యక్రమాలను తమ సంస్థ నిర్వహిస్తున్నదని తెలిపేందుకు సంతోషంగా ఉందన్నారు.
Pages: 1 -2- News Posted: 16 November, 2009
|