'మామ'కు స్వరాంజలి

సిలికాన్ వ్యాలీ (కాలిఫోర్నియా) : నాటి మేటి సంగీత దర్శకుడు స్వరబ్రహ్మ కె.వి.మహాదేవన్ సంస్మరణార్థం సన్నీవేల్ లోని హిందూ దేవాలయం ఆడిటోరియంలో 'ఝుమ్మంది నాదం' పేరిట కన్నుల పండుగగా స్వరాంజలి సంగీత విభావరి జరిగింది. ఈ విభావరిని చిమట మ్యూజిక్.కాం సంస్థ నవంబర్ 14న విజయవంతంగా నిర్వహించింది. దాదాపు 1200 మంది సంగీతాభిమానుల సమక్షంలో ఝుమ్మంది నాదం విభావరి ఐదు గంటల పాటుగా ఆద్యంతమూ ఉత్సాహభరితంగా కొనసాగింది.
అమెరికాలో సుప్రసిద్ధ గాయనీ గాయకులు రాజు ఈడూరి, మణిశాస్త్రి స్థానికంగా ప్రసిద్ధులైనన ప్రసాద్ దూర్వాసుల, విజయకుమార్ వేమూరి, మురళీకృష్ణ సంభర, రవిశంకర్ తాతా, హేమ కోట, సుధా శాస్త్రితో కలిసి లైవ్ ఆర్కెస్ట్రాతో మామ మహాదేవన్ రూపొందించిన వందల కొద్ది పాటల్లో ఆణిముత్యాలైన 22 పాటలను శ్రావ్యంగా ఆలపించారు. ఈ విభావరికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన వంశీ ప్రఖ్య, కాత్యాయని ధూళిపాళ తమదైన శైలిలో పాటల మధ్యలో మహదేవన్ సినిమాల మీద క్విజ్ లు, మామ చిత్రాల విశేషాలతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
Pages: 1 -2- News Posted: 18 November, 2009
|