ఇక ద్వంద్వ పౌరసత్వం వాషింగ్టన్ : ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక ఆమోద ముద్రను సూత్రప్రాయంగా వేశారు. ఖండాంతరాల్లో, ద్వీజాతీయులుగా రెండు దేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు సాగిస్తున్న వారికి ఇంతకాలం భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వం ఇవ్వడానికి విముఖత చూపుతూ వచ్చింది. కానీ గురువారం ఇక్కడ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ద్వంద్వ పౌరసత్వం మంజూరుకు సిద్ధంగా ఉన్నట్లు తేటతెల్లం చేసింది.అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్ ఏర్పాటు చేసిన ఈ విందుకు దాదాపు ఆరు వందల మంది భారతీయ అమెరికన్ ప్రముఖులు హజరయ్యారు.
'భారతీయ అమెరికన్లు, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ఏ స్థాయిలోనైనా తిరిగి దేశానికి రావచ్చని' ఆయన ఆహ్వానం పలికారు. 'మీరు ఇక్కడ(అమెరికా లేదా ఇతర దేశం)లేదా అక్కడ(భారత్) ఉండాలా అన్నది నిర్ణయించుకోడానికి ఎంతో కాలం పట్టదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారత అవలంభిస్తున్న సరళమైన విధానాలు రెండు చోట్లా పనిచేసే అవకాశాలను కల్పిస్తున్నాయని' ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రవాస భారతీయులు తిరిగి రావడం మనకు అనుభవమేనని, దీనిని 'మేధోలాభం' లేదా 'మనసుల కలయిక'గా పేర్కొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరిగి వచ్చినంత మాత్రాన తాము అంతకాలం బతికిన విదేశంతో అనుబంధాలు తెంచుకోనక్కర్లేదని, భారత దేశంలోఉన్నప్పటికీ ఆయా దేశాలలో పనిచేసుకోవచ్చని లేదా విదేశాల్లో ఉంటూ భారత్ లో కూడా తమ వ్యవహారాలు నడుపుకోవచ్చని ఆయన చెప్పారు. వాస్తవానికి అమెరికాలో ఉన్న విదేశీ ప్రతిభావంతులు ముఖ్యంగా భారత్, చైనా దేశీయులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో, పని చేసిన చోట్లా అదనపు నైపుణ్యాన్ని సాధించిన తరువాత మాతృదేశానికి శాశ్వతంగా వెళ్లాలని కోరుకుంటున్నట్లు వివిధ అధ్యాయాలు కూడా రుజువు చేశాయి.
ప్రధాని ఇవ్వజూపిన ద్వంద్వ పౌరసత్వం అనే ఈ ఉదారమైన కానుక భారత్-అమెరికా దేశాల మధ్య సారూప్యంగా ఉన్న జీవన విలువలు, ప్రయోజనాలకు అనుగుణమైందేనని చెప్పవచ్చు. ప్రపంచ దృక్పధంలో రెండు దేశాల మధ్య పరిణతి చెందిన బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరాలకూ అనుగుణమైంది కూడా.
Pages: 1 -2- News Posted: 27 November, 2009
|