టిఎల్ సిఎ సహృదయత
న్యూయార్క్ : ఆపన్నులను ఆదుకుంటూ అమెరికాలోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జన్మభూమికి దూరంగా అమెరికా వచ్చి ఓ గ్యాస్ స్టేషన్ పనిచేస్తున్న తన భర్త గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు టిఎల్ సిఎ ఎక్స్ అఫిషియో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ ముత్యాల వెన్నుదన్నుగా నిలిచారు. ఆమెను సొంత ఊరికి పంపించేందుకు, బ్యాంకు లాకర్ లో చిక్కుకుపోయిన పాస్ పోర్టును, ఆమె భర్త జీతాన్ని గ్యాస్ కంపెనీ నుంచి ఇప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలానికి చెందిన విట్లుంగు గంగామణి భర్త న్యూయార్క్ రాష్ట్రంలోని ఫ్లషింగ్ లో ఓ గ్యాస్ స్టేషన్ పనిచేసేవారు. కొద్ది వారాల క్రితం అతను గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. అమెరికాలో బంధువులు గాని, స్నేహితులు కాని లేని గంగామణి భర్త మృతితో అయోమయానికి గురయ్యారు. పైగా అమెరికాకు ఆమె కొత్త కూడా. తెలుగు, కొద్దిగా హిందీ మాత్రమే తెలిసిన ఆమె తీవ్ర ఆందోళ చెందారు. గంగామణి ఇబ్బందుల గురించి విన్న ఫ్లషింగ్ లోని గణేష్ ఆలయం పూజారి వెంకటేశ్ ముత్యాల ఫోన్ నెంబర్ ఇచ్చి, సహాయం అర్థించమని సలహా ఇచ్చారు.
గంగామణి ఫోన్ లో తనకు చెప్పిన బాధల గురించి విన్న వెంకటేశ్ చలించిపోయారు. చేతిలో డబ్బులు లేని ఆమెను ఆంధ్రప్రదేశ్ కు తిరిగి పంపించేందుకు దాతల విరాళాల కోసం విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్ విజ్ఞప్తికి స్పందించిన సాంబశివరావు వెనిగళ్ళ, వెంకయ్య దామా, డాక్టర్ నాగేంద్ర సాగర్ కటారి, నాగేంద్ర గుప్త, ఉదయ్ నాయుడు, ఆశాలత వైకుంఠం, రామసూర్యారెడ్డి, రంగ సింగిరెడ్డి, చిన్నబాబురెడ్డి, జగదీష్ గబ్బెట, శ్రీధర్ దూలిపేట ఉదారంగా విరాళాలు అందజేశారు.
Pages: 1 -2- News Posted: 26 February, 2010
|