ఇట్స్ ఎ గ్రేట్ హానర్ : హరి
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/dta3.jpg' align='center' alt=''>
హైదరాబాద్ : తెలుగు వారు ఎక్కడున్నా వారి ప్రతిభా పాటవాలను గుర్తించి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఢిల్లీ తెలుగు అకాడమీ (డిటిఎ) ఏటా సన్మానిస్తుండటం అభినందనీయమని డిటిఎ ఎక్స్ లెన్స్ / విశాల్ భారత్ గౌరవ్ సత్కార్ అవార్డు గ్రహీత, అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ హరికిషన్ ఎప్పనపల్లి అన్నారు. ఏ రంగంలోనైనా నిబద్ధత అవసరమనీ, ఇందుకు సేవా భావం తోడైతే పూవుకు పరిమిళం తోడైనట్టేననీ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నవోదయ స్కూల్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు పలు సేవా కార్యక్రమాలకు తాను స్థాపించిన 'ది ఎప్పనపల్లి ఛారిటబుల్ ట్రస్టు' ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తున్నామనీ,'కాన్సెప్ట్ ఇన్ కంప్యూటింగ్ ఇన్ కార్పొరేషన్' ద్వారా సాంకేతిక ఉన్నతిని చాటుతున్నామనీ చెప్పారు. ప్రతిభతో పాటు సేవానిరతిని చాటుకునే ఎందరెందరికో ఇలాంటి అవార్డులు స్ఫూర్తినిస్తాయనీ, ఇది ఒక గ్రేట్ హానర్ గా తాను చిరకాలం గుర్తించుకుంటాననీ పేర్కొన్నారు. డిటిఎ 22వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర భారీ, చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలయ లక్ష్మయ్య చేతుల మీదుగా హరికిషన్ ఎప్పనపల్లి 'విశాల్ భారత్ గౌరవ్ సత్కార్' అవార్డును అందుకున్నారు. డిటిఎ ప్రధాన కార్యదర్శి నాగరాజు, చైర్మన్ కె.ఎస్.శర్మ, ఎం.నర్సింహప్ప (ఐఆర్ఎస్), డాక్టర్ సివిఎస్ కె శర్మ, పికె బిష్ణోయి, డాక్టర్ పాలకుర్తి మధుసూధన రావు, సుధీష్ రాంబట్ల తదతరులు వేదికను అలంకరించారు. తొలుత ప్రార్థనాగీతం అనంతరం ముఖ్య అతిథులంతా జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఉగాది పురస్కారాల సంబరం మొదలైంది.
వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారిని గుర్తించి ఢిల్లీ తెలుగు అకాడమీ (డిటిఎ) సన్మానించడం అభినయందనీయమని మంత్రి మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తుండటం గర్వకారణమనీ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, ఉపాథి రంగాల్ల విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతోందనీ పొన్నాల లక్ష్యయ్య పేర్కొన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా తెలుగు అకాడమీ ఎక్స్ లెన్స్ అవార్డ్ / విశాల్ భారత్ గౌరవ్ సత్కార్ పురస్కారాలను ప్రముఖ నటుడు ఎం.బాలయ్య, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, నటుడు రఘనాథరెడ్డి, నటి సన, సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, రావికొండలరావు, కోట శంకరావు తదితరులకు ప్రదానం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంఘసేవకుడు, ప్రవాసాంధ్రుడు హరికిషన్ ఎప్పనపల్లి, 'సేవ్' సంస్థ ప్రతినిధి విజయరాం, కె.వి.ప్రవీణ్ కుమార్, డాక్టర్ జి.ఎస్.వరదాచారి, ఎం.రజిత, సిహెచ్ సత్యదేవ్, ఆలపాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ బి.భాస్కరరావు, డాక్టర్ కె.వి.సుబ్బారావు, తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ సీవిఎస్కే శర్మ, పికె బిష్ణోయి, రావికొండలరావు తదిరరులను ఢిల్లీ తెలుగు అకాడమీ ఘనంగా సన్మానించింది. సీనియర్ నటుడు నరేష్ తరఫున ఉగాది పురస్కారాన్ని ఆయన తనయుడు అందుకున్నారు.
Pages: 1 -2- News Posted: 22 March, 2010
|