అల్లుడూ! ఇదేం పని?
హైదరాబాద్: విజయవాడలో గతవారం జరిగిన మూడు రోజుల ప్రార్ధన సమావేశాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇవాంజిలిస్ట్ క్రైస్తవ మతబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ జీసస్ క్రైస్ట్ బ్లెసింగ్స్ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్నిభారీ ఎత్తున వినియోగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యముత్రి వై.ఎసే.రాజశేఖరరెడ్డికి అనిల్ కుమార్ స్వయానా అల్లుడు. ముఖ్యముత్రి కుమార్తె షర్మిల భర్త అయిన అనిల్ కుమార్ గత దశాబ్దానికి పైగా అనిల్ వరల్డ్ ఇవాంజిలిజం తరఫున మతబోధనలు చేస్తున్నా, గత సంవత్సరం డిసెంబర్ లో సికిందరాబాద్ లో మొట్టమొదటిసారిగా జీసస్ బ్లెసింగ్స్ ఉత్సవం నిర్వహించే వరకూ ప్రాముఖ్యం చెందలేదు.
అంతగా ప్రచారానికి ఇష్టపడని వ్యక్తిగా పేరుపొందిన అనిల్ కుమార్(38)కార్యక్రమాలను సూచిస్తూ రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఇవాంజిలిస్ట్ మతబోధకుడిగా తనకు తానే వ్వవహారులోకి వచ్చిన గోస్పెల్ టు అన్ రీచ్ డ్ మిలియన్స్, గ్లోబల్ పీస్ ఇనీషియేటివ్ వ్యవస్థాకుడు కె.ఎ.పాల్ రాష్ట్ర ప్రభుత్వంతో ఢీకొన్నప్పటి నుండి అనిల్ కుమార్ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి క్రితంసారి ఎన్నికల్లో నిధులు సమకూర్చనందుకు తనపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తన్నారని పాల్ ఆరోపించారు. అనిల్ కుమార్ నిర్వహిస్తున్న భారీ కార్యక్రమాలకు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయని ప్రశ్నించారు.
'అనిల్ వరల్డ్ ఇవాంజిలిజం ఉనికి గురించే చాలామందికి తెలియదు. మరి అంతటి భారీ కార్యక్రమాల నిర్వహణకు సొమ్ము ఎక్కడినుంచి వస్తోంది.రెండు నుంచి మూడు లక్షల మంది ప్రజలు పాల్గొన్న సభకు అంతమంది జనాల సేకరణక గల హస్తం ఎవరిదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎన్.రాజ్ కుమార్ ప్రశ్నించారు. 'అనిల్ కుమార్ సభలకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన వెళ్లిన ప్రతిచోట పోలీసు భద్రత, ఎస్కార్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సభలన్నీ ప్రభుత్వ కార్యక్రమాల్లాగే కనిపిస్తున్నయి' అని రాజ్ కుమార్ విమర్శించారు.
Pages: 1 -2- News Posted: 10 February, 2009
|