అల్లుడుగారూ, మీకిది తగునా?
బ్రాహ్మణుడిగా జన్మించి, క్రైస్తవ మతానికి మారిన అనిల్ కుమార్, వై.ఎస్ కుమార్తెను పదేళ్ల క్రితం వివాహమాడారని, 'మామగారు ముఖ్యమంత్రి అయిన తరువాతనే అందరికై బాగా పరిచితులయ్యారని ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ వర్గాలు వెల్లడించాయి.
అనిల్ కుమార్ హైదరాబాద్ లో అనిల్ వరల్డ్ ఇవాంజిలిజంను స్థాపించారు. సంస్థ కార్యాలయం సోమాజిగూడలోని ఆదిత్య ఇలైట్ లో వుంది. బెంగుళూరులో నివసించే అనిల్ మత సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించడానికి తరచు ఆంధ్రకు వస్తుంటారు. సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. 2001 నవంబర్ లో బి.ఎస్.ఎన్.ఎల్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లో అక్రమ ఇంటర్నేషనల్ కాల్స్ రాకెట్ ను ఛేదించారు. దీనికి సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం, ఐపిసి సెక్షన్ 420 కింద నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురిలో, పోలీసులకు లొంగిపోయిన అనిల్ కుమార్ వున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో వుండి, అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజశేఖరరెడ్డి తన అల్లుడిపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటున్నారని అసెంబ్లీలో ఆరోపించారు. అనిల్ కుమార్ పై కేసు దాఖలైన పంజగుట్ట పోలీసు స్టేషన్ అధికారి ఒకరు కేసుతో ్నిల్ కు సంబంధం ఉన్నట్టుగా సాక్ష్యాధారాలు లభించలేదని చెప్పారు. ఛార్జిషీటు ఇంకా దాఖలు కావలసి వుంది.
Pages: -1- 2 News Posted: 10 February, 2009
|