సెంట్రల్ జైలుకు పిక్నిక్!
2001లో డిఎంకె అధినేత ఎం. కరుణానిధి 'అర్ధరాత్రి' అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కేడర్ లు ఆందోళన చేసినప్పుడు జైలులో నిర్బంధితుడైన ఒక డిఎంకె కార్యకర్త తాను ఉన్న బ్లాక్ ను 'చివరిసారిగా చూసేందుకు' జైలు ఆవరణలో కలియతిరిగారు. 1990 దశకం చివర్లో జైలులో అల్లర్ల సందర్భంగా కొందరు ఖైదీలు జైలు ఉపరిభాగానికి ఎలా చేరుకోగలిగారో 'అవగాహన' చేసుకోవడానికి తాను జైలు లోపల కలియతిరిగినట్లు మరొక సందర్సకుడు చెప్పారు.
ఖైదీలకు మరణశిక్ష అమలు జరిపిన ఉరి కంబాలు ఎలా ఉంటాయో చూద్దామని పలువురు సందర్శకులు కోరుకున్నారు. తాము వాటిని చూసినప్పుడు 'ఒక విధమైన భయానికి' గురయ్యామని వారు తెలిపారు. 'నేను చిత్రాలలో మాత్రమే వాటిని చూశాను.ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను' అని ఒక సందర్శకుడు చెప్పారు. అయితే, ఈ 'చారిత్రక కట్టడం' పట్ల ఉపేక్ష వహించినవారూ లేకపోలేదు. 'ఇదేమైనా కాశీ లేదా రామేశ్వరం' వంటి పుణ్యక్షేత్రమా? లోపల చూసేందుకు ఏమున్నది' అని జైలు పక్క నుంచి వెళుతుండే కొందరు ఎద్దేవా చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 -3- News Posted: 11 February, 2009
|