సెంట్రల్ జైలుకు పిక్నిక్!
తనను కలుసుకున్న 'యుఎన్ఐ' విలేఖరితో జైళ్ళ శాఖ డిజిపి ఆర్. నటరాజన్ మాట్లాడుతూ, 'కొందరు విజ్ఞప్తి చేయడంతో' జైలును జనం చూసేందుకు అవకాశం కల్పించామని తెలియజేశారు. 'జైలు లోపల వాతావరణం గురించి ప్రజలలో గల అపోహలను తొలగించాలని మేము అనుకున్నాం' అని ఆయన చెప్పారు.'కూల్చివేత పని మొదలైన తరువాత నగరంలోని చారిత్రక కట్టడం శాశ్వతంగా మాయమవుతుంది. అందువల్ల జైలు ఆవరణను చూసేందుకు జనానికి ఎందుకు అవకాశం ఇవ్వరాదు అని మేము అనుకున్నాం' అని ఆయన తెలిపారు. 'అయినా జైలును కూల్చివేయనున్నట్లు ప్రకటించినప్పుడు మీరే (మీడియా) విపరీతమైన ప్రచారం ఇచ్చారు' అని నటరాజన్ చమత్కార స్వరంతో అన్నారు.
ఆయన మాటలను నిజం చేస్తున్నట్లుగా 14.1 ఎకరాల జైలు ఆవరణ అంతా కలియతిరిగి బయటకు వస్తున్న సందర్శకులు అనేక మంది ఏదే ఘనత సాధించినట్లుగా భావించసాగారు. 'జైలు లోపల అంతా ఒకసారి చూసేందుకు నాకు ఇదే ఏకైక అవకాశం. లేకపోతే ఏదైనా నేరం చేసి మాత్రమే నేను లోపలికి రాగలను' అని ఒక నందర్శకుడు నవ్వుతూ వ్యాఖ్యానించారు.
Pages: -1- -2- 3 News Posted: 11 February, 2009
|