నాలుగేళ్ళలో ఎంత మార్పు
'ఇప్పుడు అదంతా ఒక కల్పిత గాథలా అనిపిస్తుంది. నేను ఇప్పటికీ నా కలల్లో దానిని చూస్తుంటాను. అవార్డు ప్రకటించినప్పుడు కలిగిన అనుభూతి గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు ఒళ్ళు జలదరిస్తుంటుంది. మేమందరమూ ఆనందంతో ఏడ్చేశాం. ప్రతిమను అందుకునేందుకు మేమంతా కలసి వెళ్ళేట్లు జానా ఆంటీ చూశారు. నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. అందరి కళ్ళూ మామీదే. చెవులు దిబ్బళ్లు వేసేంత హర్షధ్వానాలు. ఎన్నెన్నో కెమేరాల ఫ్లాష్ లు...' ప్రీతి గుర్తు చేసుకున్నది.
2002లో ఇంకా టీనేజిలోకి ప్రవేశించని ప్రీతిని బ్రిస్కి, రాస్ కాఫ్ మాన్ ఫోటోగ్రఫీ గురించి బోధించడానికి, తమది, తమ తల్లులది ప్రపంచాన్ని క్లోజప్ లో చూపించడానికి తొమ్మిది మంది పిల్లలలో ఒకరుగా ఎంపిక చేశారు. 2004లో పూర్తయిన ఆ చిత్రం దాదాపు 20 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నది. వాటికి పరాకాష్ఠ ఆస్కార్.
చిత్రాన్ని ఆస్కార్లకు నామినేట్ చేసినప్పుడు దర్శకులు పిల్లలను లాస్ ఏంజెలిస్ కు తీసుకువెళ్ళారు. జీవితం కొంత కాలం ఆనందమయంగా సాగింది. పిల్లల పునరావాసం కోసం దర్శకులు తమ శాయశక్తులా కృషి చేశారు. హైస్కూలులో చదువుతున్న ప్రీతికి, ఇతరులకు అమెరికాలోనే ఉండిపోయి చదువుకోవడానికి ఆఫర్ వచ్చింది. కొందరు అలా ఉండిపోయారు. కాని ఆమె వెనుకకు తగ్గింది.
'ఆంటీ (జనా) మా తల్లికి చెక్కు రూపేణా అపారంగా డబ్బు ఇచ్చి, నన్ను విడుదల చేయవలసిందిగా కోరారు. కాని ఆమె ఒప్పుకోలేదు. నేను బాలికను. ఏకైక సంతానాన్ని. మా తల్లి వదలుకోదు. మీరు కావాలనుకుంటే దానిని కుటుంబపరమైన ఒత్తిడి అనండి. నిజంగా అదంతే' అని ప్రీతి మందహాసంతో చెప్పింది. 'ఆ విధంగా మీరు నన్ను ఇక్కడ చూస్తున్నారు' అని ఆమె అన్నది.
Pages: -1- 2 -3- -4- News Posted: 25 February, 2009
|