నాలుగేళ్ళలో ఎంత మార్పు
ఆ చిత్రంలోని పిల్లలలో ఒకడైన అభిజిత్ ఇప్పుడు న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మరొక బాలిక అక్కడే స్కూలుకు వెళుతున్నది. ప్రీతి వారిద్దరితో మాట్లాడుతూనే ఉంటుంది. మరి ఇద్దరు ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఫ్యూచర్ హోప్ లో చదువుకుంటున్నారు. ఒకరు వివాహం చేసుకోగా మరొక బాలిక అదృశ్యమైంది. ఆమె అంతర్జాతీయంగా నిధులు అందుతుండే ఒక ఎన్ జిఒతో కలసి ఉండేది.
జీన్స్, ఫ్యాషనబుల్ షర్ట్ ధరించిన ప్రీతిని చూస్తే కాలేజి విద్యార్థిని అనిపిస్తుంది. ఆమె నోటిలో నుంచి వెలువడే సిగరెట్, మద్యం వాసన మాత్రం ఆమె ఎవరో సూచిస్తాయి. కాని ఆమె కళ్ళు అందంగా కనిపించినా ఆమెలోని దూకుడు స్వభావాన్ని, తిరస్కార స్వభావాన్ని పట్టిస్తాయి.
'ఈ వయస్సులో నాకు సాల్ట్ లేక్ లో ఒక ఫ్లాట్, లాప్ టాప్, ఖరీదైన ఫోన్లు, పుష్కలంగా డబ్బు ఉన్నాయి. నాకు లోటేమున్నది' అని ఆమె తనతో మాట్లాడుతున్న విలేఖరి కళ్ళలోకి చూస్తూ అన్నది. 'జనా ఆంటీ, నేను ఇ మెయిల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తుంటాం. నేను కూడా మా తల్లి వలె ఈ వృత్తిలోకి దిగినందుకు ఆమె కోపగించుకున్నారు. ఆమె నన్ను ఈ ఊబిలో నుంచి రక్షించాలని ఆకాంక్షించారు. అయితే, ఈ వృత్తి వల్ల నాకు నిజంగా లాభమే కలిగింది' అని ఆమె చెప్పింది. ఆమె 'సంపన్నతకు' సూచిక ఏమిటంటే ఆమె ప్రేమ్ కమల్ లో గదులను అద్దెకు తీసుకున్నది. సోనాగాచ్చిలో అత్యంత ఖరీదైన భవనాలలో అది ఒకటి.
Pages: -1- -2- 3 -4- News Posted: 25 February, 2009
|